KTR: హుటాహుటిన ఢిల్లీకి కేటీఆర్.. ఎందుకంటే…?

KTR Delhi Tour: భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ధిల్లీకి వెళ్లారు.

Update: 2024-11-11 07:31 GMT

KTR: హుటాహుటిన ఢిల్లీకి కేటీఆర్.. ఎందుకంటే…?

KTR Delhi Tour: భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ధిల్లీకి వెళ్లారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ఆయన సమావేశమౌతారు. అమృత్ టెండర్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆయన గతంలో ఆరోపణలు చేశారు. ఈ విషయమై కేంద్రమంత్రికి ఫిర్యాదు చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కేటీఆర్ చేసిన ఆరోపణలు ఏంటి?

అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో దాదాపు రూ. 1500 కోట్ల టెండర్లను సీఎం రేవంత్ రెడ్డి తన బావమరిది ఎస్. సృజన్ రెడ్డికంపెనీకి కట్టబెట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి ఈ ఏడాది సెప్టెంబర్ 20న లేఖ రాశారు.ఈ టెండర్లు దక్కించుకున్న కంపెనీల వివరాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పురపాలక శాఖలో జరిగిన అన్ని టెండర్లను బయటపెట్టాలని కోరారు.

 వాస్తవం లేదన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి

అమృత్ టెండర్ల విషయంలో కేటీఆర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి చెప్పారు. ఈ విషయంలో ఆయనకు తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని ఆయన అన్నారు. వ్యాపారాలు వేరు, రాజకీయాలు వేరన్నారు.కేటీఆర్ ఆరోపణలు చేసిన కంపెనీ తన అల్లుడిదని ఆయన చెప్పారు. నిబంధనల మేరకు కాంట్రాక్టు వచ్చిందని ఆయన అప్పట్లోనే ప్రకటించారు.

కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపిన సృజన్ రెడ్డి

ఈ ఆరోపణలపై ఎస్. సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. తనపై, తన కంపెనీపై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని ఈ ఏడాది సెప్టెంబర్ 26న పంపిన లీగల్ నోటీసులో తెలిపారు.తన పరువుకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా ఆ నోటీసులో ఆయన కోరారు.

Tags:    

Similar News