KTR: హామీలు నెరవేర్చడం చేతకాక ట్యాపింగ్, స్కామ్‌లు అంటూ డ్రామాలు
KTR: ఏం చేస్తారో చేయండి.. మీ బెదిరింపులకు ఎవరూ భయపడరు
KTR: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. బెదిరింపులకు భయపడేది లేదన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్... అబద్ధపు హామిలతో అధికారంలో వచ్చి.. నెరవేర్చడం చేతకాక ట్యాపింగ్ గేమ్ ఆడుతున్నారని ఫైరయ్యారు. ప్రజలను మభ‌్యపెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో విచారణ చేసి బయటపెట్టాలని.. సీఎం రేవంత్ బెదిరింపులకు ఎవరూ భయపడరని తెలిపారు.