KTR: భారత్ జోడో.. రాహుల్ చోడో.. ఇండియా కూటమి నుంచి ఒక్కో పార్టీ బయటకు వెళ్లిపోతుంది

KTR: కాంగ్రెస్ నైజమే మోసం

Update: 2024-01-27 09:29 GMT

KTR: భారత్ జోడో.. రాహుల్ చోడో.. ఇండియా కూటమి నుంచి ఒక్కో పార్టీ బయటకు వెళ్లిపోతుంది

KTR: మోసం చేయడమే కాంగ్రెస్ నైజం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ ఉండకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని, తెలంగాణ తెచ్చినందుకా, ప్రజల బతుకులు మార్చినందుకా కేసీఆర్ బొండిగే నొక్కాలని చూస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు కాంగ్రెస్ మోసాలను చూసే కూటమి నుంచి ఒక్కోక్కరు బయటకు వెళ్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షలో పాల్గొన్న కేటీఆర్.. పార్లమెంట్‌ ఎన్నికల కోసం పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.

Tags:    

Similar News