ఇవాళ కృష్ణా నది యాజమాన్య బోర్డు మీటింగ్

*జలసౌధలో కేఆర్ఎంబీ చైర్మన్ అధ్యక్షతన సమావేశం

Update: 2022-05-06 05:44 GMT

ఇవాళ కృష్ణా నది యాజమాన్య బోర్డు మీటింగ్

Hyderabad: ఇవాళ KRMB సమావేశం కానుంది. జలసౌధలో కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఎజెండా అంశాలను ఇరు రాష్ట్రాలకు అందజేశారు. బోర్డు వార్షిక బడ్జె‌ట్‌‌తో‌పాటు పరి‌పా‌లన, ప్రాజె‌క్టుల నిర్వహ‌ణకు సంబం‌ధించి విధి‌వి‌ధా‌నాలు, 2022-23 సంబం‌ధించి నీటి వాటా ఒప్పందం అంశాన్ని పొందు‌ప‌రి‌చారు. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల మధ్య 50 - 50 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక పంపకాలు జరపాలని తెలంగాణ రాష్ట్రం చేసిన విజ్ఞప్తిపై KRMB కీలక నిర్ణయం తీసుకోనుంది. జలసౌధలో ఇవాళ కృష్ణా బోర్డు సమావేశమై ఈ అంశంపై చర్చించనుంది.

ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో తాత్కాలిక పంపకాలు జరపాలని బోర్డు గతంలో నిర్ణయించింది. దీనిపై తెలంగాణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ డ్యాంలు ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయని, 820 కోట్లతో తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉందని సమావేశం అజెండాలో బోర్డు పేర్కొంది. రెండు రాష్ర్టాల ఉమ్మడి ప్రాజెక్టుల భద్రతపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. 

Tags:    

Similar News