Kishan Reddy: ప్రజల తీర్పును బీజేపీ శిరసా వహిస్తుంది.. లోపాలను సరిదిద్దుకుంటాం..
Kishan Reddy: బీజేపీ ప్రజల తీర్పును శిరసా వహిస్తుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు.
Kishan Reddy: బీజేపీ ప్రజల తీర్పును శిరసా వహిస్తుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. కర్ణాటకలో జరిగిన ప్రచారంలో ప్రధాని మోడీపై ప్రజలు ఎంతో అభిమానం చూపారని తెలిపారు. స్థానిక వ్యతిరేకత కాంగ్రెస్కు అనుకూలంగా పని చేసిందని అభిప్రాయపడ్డారు. సంవత్సరం లోపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ పార్లమెంట్ సీట్లు కర్ణాటకలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. స్థానికంగా జరిగిన లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు. కర్ణాటకలో కొన్ని పొరపాట్లతో ఓడిపోయామని.. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వందల పొరపాట్లు చేసిందన్నారు కిషన్రెడ్డి.