Kishan Reddy: సింగరేణి ప్రైవేటీకరణ పై మరోసారి స్పందించిన కిషన్ రెడ్డి

Kishan Reddy: అసద్ అడిగిన ప్రశ్నకు కిషన్ రెడ్డి లిఖితపూర్వక సమాధానం

Update: 2024-07-31 14:21 GMT

Kishan Reddy: సింగరేణి ప్రైవేటీకరణ పై మరోసారి స్పందించిన కిషన్ రెడ్డి

Kishan Reddy: సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నకు పార్లమెంట్ వేదికగా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. జులై 24న సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని లోక్‌సభలో కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం అని.. కేంద్రానికి 49 మాత్రమే ఉండగా... సింగరేణిని తాము ఎలా ప్రైవేటీకరిస్తామన్నారు. తాజాగా మరోసారి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అడగగా... దీనికి కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గనుల కేటాయింపులో పారదర్శకత ఉండేందుకే వేలం ప్రక్రియను చేపడుతున్నామని తెలిపారు.

Tags:    

Similar News