Kishan Reddy: బీజేపీ ముఖ్య నాయకులతో కిషన్ రెడ్డి సమావేశం

Kishan Reddy: పార్టీ విజయం కోసం కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు

Update: 2024-06-29 16:15 GMT

Kishan Reddy: బీజేపీ ముఖ్య నాయకులతో కిషన్ రెడ్డి సమావేశం 

Kishan Reddy: ద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ముఖ్య నాయకులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విజయం కోసం కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో బిజెపి కార్యకర్తలందరూ ఎంతో కష్టపడ్డారని, ఎన్నికల్లో నరేంద్ర మోదీ నీ బిజెపి ని ఓడించాలనీ దేశ వ్యాప్తంగా కొన్ని అంతర్జాతీయ శక్తులు కుట్ర చేశాయన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని రెండు నియోజకవర్గాల్లో బిజెపి వ్యతిరేక శక్తులు ఏకమయ్యాయని, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి మెజారిటీ రాలేదని ఆయన అన్నారు.

Tags:    

Similar News