Ganesh Laddu Auction: గణనాథుడి లడ్డూ ఆల్ టైం రికార్డ్..వేలం పాటలో రూ. 1.87కోట్ల పలికిన లడ్డూ ధర

Ganesh Laddu Auction: హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో గణేశ్ లడ్డూ వేలం పాటు జరిగింది. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో నిర్వహించిన వేలం పాటలో లడ్డూ ఏకంగా రూ. 1.87కోట్లు పలికింది.ఇది తెలుగు రాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు క్రియేట్ చేసింది.

Update: 2024-09-17 03:48 GMT

వినాయక చవితి కంటే గణేశుడి నిమజ్జనంపై అందరి ద్రుష్టి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు లడ్డూల వేలంపాట జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ కూడా బాలాపూర్ లడ్డూ ఎక్కువ ధర పలుకుతుంది. కానీ ఇఫ్పుడు కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో గణేశుడి లడ్డూ వేలంపాట జరిగింది. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో నిర్వహించిన వేలంపాటలో లడ్డూ ఏకంగా రూ. 1.87 కోట్లు పలికింది. దీన్ని దక్కించుకున్న భక్తుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.

కాగా గతేడాది ఇక్కడి లడ్డూ రూ.1.20 కోట్లు పలికిందని సమాచారం. ఈ సారి ఆ ధరను బ్రేక్ చేసేలా వేలంపాట జరిగింది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని మాదాపూర్ మై హోం భూజాలో గణేశ్ లడ్డూ వేలంపాటలో ఖమ్మం జిల్లాలకు చెందిన కొండపల్లి గణేష్ రూ. 29లక్షలకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News