Khammam: కొవిడ్ వార్డును పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్
Khammam: ఊహించకుండానే విరుచుకుపడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ప్రాణాలు తీస్తున్న కొవిడ్ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి సీఎం ఆదేశాల మేరకు పని చేస్తున్నామన్నారు మంత్రి పువ్వాడ అజయ్.
Khammam: ఊహించకుండానే విరుచుకుపడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ప్రాణాలు తీస్తున్న కొవిడ్ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి సీఎం ఆదేశాల మేరకు పని చేస్తున్నామన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని కొవిడ్ బ్లాక్‌ను మంత్రి పరిశీలించారు. కొవిడ్ పెషేంట్లకు మనోధైర్యాన్ని నింపారు. వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి తన సొంత నిధులతో కొవిడ్ పేషెంట్ల కోసం ఏర్పాటు చేసిన భోజనం అందించారు.
ఖమ్మం కలెక్టరేట్‌లో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో మంత్రి పువ్వాడ అజయ్ సమావేశం నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా కోవిడ్ హాస్పిటల్స్‌ను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధిక ఫీజులు వసూలు చేసినా రెమిడెసివర్ ఇంజక్షన్లను బ్లాక్‌లో విక్రయించినా ఆస్పత్రుల అనుమతులను రద్దు చేస్తామని మంత్రి పువ్వాడ తెలిపారు. అలాగే, అవసరానికి మించి రెమిడెసివర్ ఇంజక్షన్లను స్టాక్ పెట్టుకోవద్దని ప్రైవేట్ ఆస్పత్రులకు సూచించారు మంత్రి పువ్వాడ.