Khairatabad Ganesh Shobhayatra 2024:గంగమ్మ ఒడికి గణనాథుడు..ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర షురూ
Khairatabad Ganesh Shobhayatra: హైదరాబాద్ ల ఖైరతాబాద్ గణనాథుడి సహా వినాయక విగ్రహాల నిమజ్జనం భక్తుల సందడి మధ్య ఘనంగా ముందుకు సాగుతుంది. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా 10 రోజుల పాటు భక్తులచే పూజలందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు మరికొన్ని గంటల్లో గంగమ్మ ఒడికి చేరుతాడు. 70 అడుగుల ఎత్తులో భారీ కాయుడై..ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన తర్వాత పార్వతీ తనయుడిని టస్కర్ పైకి చేర్చారు.

స్వామివారికి ఇరువైపులా ఉన్న దేవతా మూరుల విగ్రహాలను ట్రాలీలపైకి చేర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత ఖైరతాబాద్ నుంచి శోభాయాత్రం ప్రారంభం అయ్యింది. భక్తుల కొంగుబంగారమై 10 రోజుల పాటు, నీరాజనాలందుకున్న మహాకాయుడి నిమజ్జనానికి భారీగా భక్తజనం రానున్న నేపథ్యంలో అదే స్థాయిలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గణేశుడి బందోబస్తులో 700 మంది పోలీసులు పాల్గొన్నారు. 56 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతేకాదు ఇవాళ ఉదయం 6గంటల నుంచి బుధవారం రాత్రి 10గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.
గతంతో పోలిస్తే ఈసారి గణపతి మండపాలు భారీగా పెరిగాయి. దాదాపు లక్ష విక్రమాలు హుస్సేన్ సాగర్ తరలివస్తాయిన గురువారం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. 5లక్షల మంది భక్తులు ఈ వేడుకను తిలకించేందుకు సాగర పరిసరాలకు చేరుకుంటారని పోలీసులు చెబుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం ప్రభుత్వ యంత్రాంగమంతా క్షేత్రస్థాయి పరిశీలన చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు. శోభాయాత్ర జరిగే మార్గాలు, హాజరుకానున్న భక్తులు , ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అదే సమయంలో హైదరాబాద్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ తోపాటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ , జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి సాగర్ చుట్టూ ఏర్పాట్లను పరిశీలించారు. ఖైరతాబాద్ గణపతికి ఎన్టీఆర్ మార్క్ బాలపూర్ గణనాథుడికి ట్యాంక్ బండ్ పై నిమజ్జనం ఉంటుందని అధికారులు తెలిపారు.