Khairatabad Maha Ganapati: ముగిసిన ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం

Khairatabad Maha Ganapati: ఖైరతాబాద్‌ గణేషుడు గంగమ్మ ఒడికి చేరాడు.

Update: 2024-09-17 08:28 GMT

Khairatabad Maha Ganapati: ముగిసిన ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం

Khairatabad Maha Ganapati: ఖైరతాబాద్‌ గణేషుడు గంగమ్మ ఒడికి చేరాడు. భారీ గణనాథుని నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 1.39 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం పూర్తయింది. 4వ క్రేన్ దగ్గర 70 అడుగుల ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. దీంతో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన క్రతువు వైభవంగా సాగింది.

70 అడుగుల భారీ మహా గణనాథుని విగ్రహాన్ని వేలాది మంది భక్తుల మధ్య డప్పుల మోత, డీజేల కోలాహలమైన సంగీతం మధ్య ట్యాంక్‌బండ్‌కు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ శోభాయాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో శోభాయాత్ర మార్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News