Phone Tapping Case: ఫోన్‌ట్యాపింగ్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

Phone Tapping Case: ప్రణీత్, భుజంగరావు, తిరుపతన్న స్టేట్‌మెంట్లతో.. కీలక విషయాలు బహిర్గతం

Update: 2024-03-25 03:31 GMT

Phone Tapping Case: ఫోన్‌ట్యాపింగ్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్‌, భుజంగరావు, తిరుపతన్న రిమాండ్‌ రిపోర్ట్‌‌తో కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని తమ విచారణలో ప్రణీత్‌, భుజంగరావు, తిరుపతన్న స్టేట్‌మెంట్ ఇచ్చినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

ఏడు రోజుల విచారణలో కీలక విషయాలను వెల్లడించాడు నిందితుడు ప్రణీత్ రావు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌రావే కీలక సూత్రధారిగా విచారణలో తేలింది. ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు నిర్థారించారు.దీంతో ఈ కేసులో ప్రభాకర్‌రావును ఏ1గా చేర్చారు పోలీసులు. ఏ2గా ప్రణీత్‌రావు, ఏ3గా రాధాకిషన్, ఏ4గా భుజంగరావు, ఏ5గా తిరుపతన్న, ఏ6గా ప్రైవేట్ వ్యక్తి పేరును చేర్చారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ డివైజ్‌లను ప్రణీత్‌రావు ధ్వంసం చేశాడు. ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన హార్డ్‌ డిస్క్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్‌ను పోలీసులు రిట్రీవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

భుజంగరావు, తిరపతన్న ఇచ్చిన నెంబర్లను ప్రణీత్‌ ట్యాప్‌ చేసినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఎన్నికల సమయంలో వందలాది రాజకీయ నేతలు, వారి కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాప్‌ చేశానని, రాజకీయ నేతలు కదలికలు, నిధుల సమీకరణపై దృష్టిపెట్టానని ప్రణీత్‌రావు విచారణలో వెల్లడించాడు. వ్యాపారవేత్తలతో పాటు సమాజంలో పేరు ఉన్న వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశామన్నారు. ట్యాపింగ్‌ సంబంధించిన మెయిన్ డివైజ్‌ని పూర్తిగా ధ్వంసం చేశానని వెల్లడించాడు. రెండు లాకర్‌ రూములలో ఉన్న డాక్యుమెంట్లు అన్నిటిని తగలబెట్టామని ప్రణీత రావు వెల్లడించాడు.

ఇక బీఆర్‌ఎస్‌ కీలక నేత ఇచ్చిన నెంబర్లను ట్యాప్‌చేశానని.. ప్రణీత్‌ ఇచ్చిన సమాచారాన్ని బీఆర్‌ఎస్‌ కీలక నేతకు చేరవేశామని భుజంగరావు చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా మంది రాజకీయ నేతల ఫోన్లను కుటుంబ సభ్యుల నెంబర్లను టాప్ చేశామని తెలిపారు. మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు ఇచ్చే నంబర్లను ప్రణీత్‌కి ఇచ్చానని తిరుపతన్న వెల్లడించారు. హైదరాబాద్ సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు డీసీపీ షేర్ చేశాడు. డీసీపీ చెప్పిన నంబర్లతో పాటు కొంతమంది కదలికలను ట్రాక్ చేశామని తిరుపతన్న తెలిపారు. దీంతో ట్యాపింగ్ చేయమనే టాస్క్ ఇచ్చిన ఆ బీఆర్ఎస్ కీలక నేతకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News