KCR: నేడు అసెంబ్లీకి కేసీఆర్
KCR: ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా అసెంబ్లీకి కేసీఆర్
KCR: ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి హాజరుకానున్నారు. గత రెండు రోజులుగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. గవర్నర్ ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాలేదు. నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.
ఈ సమావేశానికి కేసీఆర్ హాజరుకానున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం చర్చ జరిగింది. అయితే కేసీఆర్ సభకు హాజరుకాలేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక తొలి శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు తుంటికి గాయం కారణంగా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ సభకు హాజరుకాలేదు. ఇటీవలే ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.