Rasamayi Balakishan: డోంట్ రిపీట్ నెక్స్ట్ టైమ్‌ అని కేసీఆర్‌ వార్నింగ్ ఇచ్చారా?

Rasamayi Balakishan: జీరబోయిన ఆ గొంతు మళ్లీ పాటందుకుంటుందా? గజ్జెలు పక్కన పెట్టిన ఆ కాలు మళ్లీ గజ్జె కట్టి కోరస్ అందుకుంటుందా?

Update: 2021-07-23 09:42 GMT

Rasamayi Balakishan: డోంట్ రిపీట్ నెక్స్ట్ టైమ్‌ అని కేసీఆర్‌ వార్నింగ్ ఇచ్చారా?

Rasamayi Balakishan: జీరబోయిన ఆ గొంతు మళ్లీ పాటందుకుంటుందా? గజ్జెలు పక్కన పెట్టిన ఆ కాలు మళ్లీ గజ్జె కట్టి కోరస్ అందుకుంటుందా? ఉద్యమంలో ప్రభుత్వంలో పాటనై వచ్చిన ఆ నేత ఇన్నాళ్లు ఎందుకు సైలంటయ్యారు? పార్టీకి, ప్రభుత్వానికి అంటీముట్టనట్టుగా ఆ ఎమ్మెల్యేను ఇక సైడ్ చేసారనుకున్న వేళ మళ్లీ పిలిచి, భుజాన గొంగడేసి కాలికి గజ్జ ఎందుకు కట్టారు? పార్టీలో ప్రభుత్వంలో ఆ నిర్ణయం మీద వ్యతిరేకత ఉన్నా అధినేతకు ఇష్టం లేకపోయినా కష్టంగానే ఆ పదవి మళ్లీ ఆయనకే ఎందుకు కట్టబెట్టారు? సాంస్కృతిక సారథి ఛైర్మన్ నియామకం వెనుక జరిగిదేమిటి?

దిస్ ఈజ్ రసమయి బాలకిషన్. మానకొండూర్ ఎమ్మెల్యే. హుజూరాబాద్ ఉపఎన్నికల వేళ ఎమ్మెల్యే రసమయికు మూడోసారి ముఖ్య పదవి వరించింది. రాష్ట్ర్ర సాంస్క్రృతికి సారధి ఛైర్మన్‌గా సీఎం కేసీఆర్ మరోమారు అవకాశం కల్పించారు. ఆ బాధ్యతలు కూడా అట్టహాసంగా చేపట్టారు. రసమయికి మళ్లీ పదవి వరించడం ఎలా సాధ్యమబ్బా అని టీఆర్ఎస్‌లోనే కొన్ని వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట. రసమయిని తగ్గించారు ఆయన పనైపోయిందని, టీఆర్ఎస్‌లో ముఖ్యనేతలు ఓ నిర్ణయానికి వచ్చేసిన టైమ్‌లో ఉన్నపళంగా కేసీఆర్ పిలిచి బాలకిషన్ అంటూ సాంస్కృతిక సారథి పదవిని కట్టబెట్టారు.

రసమయి బాలకిషన్ డే-వన్ నుంచి మంత్రి హరీష్‌రావు, ఈటల శిబిరంలో నమ్మినబంటు అన్నది ఓపెన్ సీక్రెట్. రసమయికి పార్టీలో, ప్రభుత్వంలో ప్రయార్టీ తగ్గించడంతో అంటీముట్టనట్టుగానే ఉన్నారు. ఈటల ఎపిసోడ్‌కు ముందు, తరువాత అదే అసంతృప్తితో ఉన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఆయన వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్నారన్న టాక్‌ వినిపిస్తోంది. అందుకే పార్టీ సభలలో, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆటాపాటకు ప్రత్యేక టీమ్‌లను పెట్టుకున్నారు. మానకొండూర్‌లో కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆరెపల్లి మోహన్‌ను ఎంకరేజ్ చేయగా సభలకు సాయిచంద్‌కు ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. ఒక దశలో ఇక ఇదే నా ఆఖరి రాజకీయ మజిలీ కూడా అని రసమయి అక్కడక్కడ బాధపడుతూ చెప్పినట్టు వార్తలొచ్చాయి.

అందుకే ఈటల నిర్వహించిన బెంగుళూర్ క్యాంపులో ఉన్నారని, ఆ తర్వాత మంత్రి జగదీష్‌రెడ్డి తీసుకెళ్లిన హంపీ టూర్‌లోనూ కేసీఆర్ ఫ్యామిలికి వ్యతిరేకంగా పాటలు పాడారని అభియోగాలూ ఎదుర్కొన్నారు. ఈ దెబ్బతో రసమయి అవుట్ అని కూడా పుకార్లు షికార్లూ కొట్టాయి. మహబూబాబాద్‌లో ఒక సంస్మరణ సభలో మాట్లాడిన రసమయి రాజకీయాలపై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము మాట పాట అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుందని స్వేచ్ఛ పోయిందని ఇలాంటి జీవితం కోరుకోలేదన్నారు. ఆకలిని అయినా చంపుకొని ఆత్మాభిమానంతో బతికే వాడిని తానన్నారు. అందరూ ఆశీస్సులు వల్లే ఈ రోజు ఇక్కడ ఉన్నానన్నారు. పవర్ ఉంటేనే మాకు చప్పట్లు కొడుతుంటారు. టీఆర్ఎస్ పార్టీ ఓ కంపెనీగా మారిందని ఆవేదన చెందారు. ప్రభుత్వ పథకాలను, సీఎం కేసీఆర్‌ను ప్రశంసిస్తూ అసెంబ్లీలో సైతం తన పాటలతో దుమ్ములేపిన రసమయి ఇప్పుడిలా మాట్లాడటం అందరినీ అప్పట్లో అందరిని ఆశ్చర్యపరిచింది.

ఉన్నపళంగా సీఎం కేసీఆర్ దళిత సాధికారిత సమావేశానికి ముందే పిలిచి అన్నీ జాగ్రత్తలు చెప్పి డోంట్ రిపీట్ నెక్స్ట్ టైమ్‌ అని వార్నింగ్ ఇచ్చారట. మళ్లీ మంచి పొజిషన్‌లో ఉంటావ్ పిచ్చి పిచ్చి కథలు పడొద్దంటూ చెప్పి రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ పదవి కట్టబెట్టారట. అయితే రసమయిపై ఇంత వ్యతిరేకతతో గుర్రుగా ఉన్న కేసిఆర్ మనసు ఎవరు మార్చారు ఎందుకు మార్చారు నెగిటివిని కూడా పాజిటివ్ కోణంలో చేసిందెవ్వరు? ముళ్లును ముళ్లుతోనే తీయాలనే రాజకీయ వ్యూహంతో ట్రబుల్ షూటర్ హరీష్‌రావు కూడా రసమయికి పదవి దక్కడంలో కీలక పాత్ర పోషించారట. ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకంలో కూడా పేర్ల ప్రతిపాదనలో హరీష్ పాత్రే కీలకంగా మారిందన్న ప్రచారం జరిగింది. అయితే హుజురాబాద్ ఉపఎన్నిక వేళ రసమయిని దూరం చేసుకుంటే బాగుండదని చెప్పారట. బయటకు వెళ్లేందుకు గ్రౌండ్ ప్రీపేర్ చేసుకున్న రసమయి కదలికలను మంత్రి హరీష్ పసిగట్టి కేసీఆర్‌కు చెప్పారట. అందుకే తమ వైపు తిప్పుకోవడానికే మూడోసారి రాష్ట్ర్ర సాంస్కృతిక సారథి పదవి కట్టబెట్టారని అంటున్నారు.

మొత్తానికి దళితులకు దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్- ఆ వర్గం నేతల్లో ఉన్న అసంతృప్తి చల్లార్చే ప్రయత్నం చేస్తోందన్న ప్రచారం ఊపందుకుంది. అందులో భాగంగానే పార్టీ నేతలకు ముందు పదవులిస్తూ తమ శిబిరం నుంచి బయటకు వెళ్లకుండా, ప్రత్యర్థుల వైపు మళ్లకుండా జాగ్రత్త పడుతోందట.

Tags:    

Similar News