గ్రేటర్ ఎన్నికలపై మంత్రులు, పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై గులాబీ దళం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సంసిద్దంగా ఉండాలని సీఎం కేసీఆర్ మంత్రులు, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై గులాబీ దళం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సంసిద్దంగా ఉండాలని సీఎం కేసీఆర్ మంత్రులు, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఏక్షణంలోనైనా గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చని..ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. గ్రేటర్ లో వంద సీట్లు గెలుపే లక్ష్యంతో ముందుకు వెళ్లాలన్నారు సీఎం కేసీఆర్.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వంద సీట్లు గెలుపే లక్ష్యంతో పని చేయాలని పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ సూచించారు. ప్రగతి భవన్ లో మంత్రులు, ప్రధానకార్యదర్శులతో గ్రేటర్ హైదరాబాద్, పట్టభద్రుల ఎన్నికల్లో ఏవిధంగా వ్యవహరించాలో అన్న అంశంపై సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని దిశా నిర్దేశం చేశారు.డివిజన్ల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమిస్తాం. ప్రధాన కార్యదర్శులు ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేయాలన్నారు.
గ్రేటర్ పరిధిలో పార్టీ పరిస్థితిపై సీఎం కేసీఆర్ మంత్రులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని.. పార్టీ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. వందకు పైగా స్థానాలు గెలుచుకుంటామని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ఓటమిపై విశ్లేషించారు. మంత్రి హరీష్ రావుతో దుబ్బాక ఫలితంపై ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ కు హరీష్ రావు ఓ నివేదిక సమర్పించారు.. దుబ్బాకలో బిజెపి అభ్యర్థిపై సానుభూతి మాత్రమే పని చేసిందని అందుకే విజయం సాధించారని, పార్టీ పట్ల ప్రజలు వ్యతిరేకంగా లేరని
మంత్రులకు సీఎం సూచించారు. దుబ్బాక ఉప ఎన్నికలు వచ్చే గ్రేటర్ హైదరాబాద్ పట్టభద్రులు ఎన్నికల్లో దాని ప్రభావం ఏమాత్రం ఉండదని ఎన్నికల్లో అందరూ కష్టపడి పని చేయాలని ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి భారీ మెజార్టీతో గెలుపొంది చూడాలని సూచించారు.. మంత్రులు, ప్రధాన కార్యదర్శులతో సీఎం కేసీఆర్ సుధీర్ఘంగా చర్చిస్తున్న సమయంలోనే ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రగతి భవన్ చేరుకున్నారు. సీఎం కేసీఆర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.గ్రేటర్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో పాతబస్తీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.
దుబ్బాక ఉప ఎన్నికల ఓటమి షాక్ నుంచి పార్టీ శ్రేణుల దృష్టి మరల్చేందుకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందస్తుగా వెళ్లాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రణాళికలు ఏమేరకు ప్రభావితం చూపుతాయో వేచి చూడాల్సిందే.