Telangana: సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం
Telangana: తెలంగాణలో 19 జిల్లా కేంద్రాలలోని ప్రధాన ప్రభుత్వ హాస్పిటల్స్‌లో డయాగ్నొస్టిక్ సెంటర్లను ఏర్పాటు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Telangana: తెలంగాణలో 19 జిల్లా కేంద్రాలలోని ప్రధాన ప్రభుత్వ హాస్పిటల్స్‌లో డయాగ్నొస్టిక్ సెంటర్లను ఏర్పాటు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటిని జూన్ ఏడున ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. 19 జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాబద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్ధిపేట, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, గద్వాల, అసిఫాబాద్ జిల్లాల్లో ప్రధాన వైద్య కేంద్రాలలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్న డయాగ్నొస్టిక్ కేంద్రాలను ప్రారంభించాలని వైద్యాధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు, అన్ని రకాల వైద్యసేవలను మరింతగా అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు.
ప్రభుత్వం ప్రారంభించబోతున్న డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు. అందులో కరోనా పరీక్షలతో పాటుగా.. రక్త పరీక్ష, యూరిన్ టెస్ట్ సహా బీపీ షుగర్, గుండె జబ్బులు, బొక్కల జబ్బులు, లివర్, కిడ్నీ, థైరాయిడ్ వంటి వాటికి సంబంధించిన ఎక్స్ రే బయోకెమిస్ట్రీ పాథాలజీకి సంబంధించిన పరీక్షలు చేస్తారని వెల్లడించారు. సాధారణ పరీక్షలే కాకుండా, అత్యంత అరుదుగా చేసే ఖరీదుతో కూడుకున్న ప్రత్యేక పరీక్షలను పూర్తిగా ఉచితంగా చేసి తక్షణమే రిపోర్టులిస్తారని సీఎం తెలిపారు. అంతేకాదు.. రిపోర్టులను సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్‌ల రూపంలో అందిస్తారని స్పష్టం చేశారు.
ప్రభుత్వ డయాగ్నోసిస్ కేంద్రాల్లో అత్యంత సామర్థ్యంతో కూడుకుని అత్యంత వేగంగా రిపోర్టులందించనున్నాయి. ఒక్కో యంత్రం గంటకు 400 నుంచి 800 రిపోర్టులను అత్యంత కచ్చితత్వంలో అందిస్తాయని వైద్యాధికారులు వెల్లడించారు. ఎమర్జెన్సీ సమయాల్లో హాస్పిటల్‌కు తీసుకుపోవడానికి వినియోగిస్తున్న428.. 108 వాహనాలు నిరంతరం నడుస్తున్నాయన్నారు. బాలింతలు తల్లీ బిడ్డల రక్షణ రవాణా కోసం అమ్మఒడి పథకం ద్వారా ఇప్పటికే 300 వాహనాలను ఏర్పాటు చేసి వైద్యాన్ని అందిస్తున్నదని సీఎం అన్నారు.