కేంద్రానికి డెడ్‌లైన్ విధించిన సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారు..?

KCR: ఇవాళ మధ్యాహ్నాం 2గంటలకు ప్రగతిభవన్ లో కేబినెట్ భేటీ...

Update: 2022-04-12 02:23 GMT

కేంద్రానికి డెడ్‌లైన్ విధించిన సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారు..?

KCR: ఢిల్లీ వేదికగా కేంద్రానికి 24 గంటల డెడ్ లైన్ విధించిన కేసీఆర్ ఏం చేయబోతున్నారు. ధాన్యం కోనకపోతే తేల్చుకుంటామని సవాల్ విసిరిన కేసీఆర్ ఇవాల్టీ కేబినెట్ మీటింగ్‌లో ఏం నిర్ణయం తీసుకుంటారు. ఉన్నపలంగా మంత్రివర్గ మీటింగ్ ఏర్పాటు చేయటం వెనుక ఉన్న మతలబు ఏంటి. వరి ధాన్యం పై సర్కార్ ఏం తేల్చనుంది. ఇప్పుడివే ప్రశ్నలు తెలంగాణ ప్రజానీకాన్ని వెంటాడుతున్నాయి. తెలంగాణ కేబినెట్ మీటింగ్ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్ లో జరగనుంది.

యాసంగి పంట కొనుగోలుపై రాష్ట్ర కేబినెట్‌లో చర్చించనున్నారు. ఈ నెల 4 నుంచి మొదలైన వరి పోరు ఢిల్లీలో మహా ధర్నా వరకు సాగింది. ధర్నా వేదికగా కేసీఆర్ కేంద్రానికి 24గంటల డెడ్‌ లైన్ ఇచ్చారు. ఈ డెడ్‌ లైన్ ఈ రోజు మధ్యాహ్నాం వరకు ముగియనుంది. దీంతో కేసీఆర్‌ ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ మైదలైంది. సీఎం కేసీఆర్ గత కేబినెట్ సమావేశంలో యాసంగి పంట కేంద్రం కొనదు కాబట్టి రాష్ట్రం కూడా ఐకెపి కేంద్రాలు ఏర్పాటు చేయదని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

అయితే రాష్ట్ర బీజేపీ నేతలు వరి పంట వేసుకోండని రైతులకు చెప్పడంతో యాసంగిలో కూడా వరి ధాన్యం అధిక దిగుబడి పెరిగిందనేది టిఆర్ఎస్ ప్రభుత్వ వాదన. కేంద్ర ప్రభుత్వం కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతాంగం గందరగోళ పరిస్థితుల్లో ఉంది.ఈ ఈ నేపథ్యంలో రైతుకు భరోసా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ప్రభుత్వం ఐకెపి కేంద్రాలు ఉండవని చెప్పినప్పటికీ... కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి కారణంగా రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టేందుకు సర్కారు సిద్ధమైంది.

ధాన్యం కొనుగోలుపై శాశ్వత పరిష్కారం కోసం అన్ని అంశాలపై రాష్ట్ర కేబినెట్ చర్చించనుంది. తెలంగాణలో 36లక్షల ఎకరాల్లో పంట పండించారనేది ప్రభుత్వ అంచనా. దీంతో మొత్తం ధాన్యం కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం కానుంది. అలాగే ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.. సేకరించిన ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలి అనే అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నారు. రా రైస్ మాత్రమే కొంటామని కేంద్రం చెబుతున్న తరుణంలో నూక శాతం ఎంత ఉంటుంది.

మిగిలిన నూకను ఏవిధంగా ఉపయోగించుకోవాలన్న దానిపైనా కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తానికి యాసంగి వరి ధాన్యం కొనుగోలుతో పాటు మరికొన్ని కీలక అంశాలపై కూడా రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో చర్చకు రానున్నాయి.

Tags:    

Similar News