Delhi Liquor Case: లిక్కర్ కేసులో లంచాలు ఇచ్చిన వ్యక్తుల్లో కవిత ఒకరు: జోయబ్ హుస్సేన్
Delhi Liquor Case: ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత డేటాను డిలిట్ చేశారు -జోయబ్ హుస్సేన్
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవిత మద్యంతర బెయిల్ పిటీషన్‌పై కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కవిత తరుపున సింఘ్వీ వాదనలు వినిపిస్తుండగా... ఈడీ తరుపున జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు. కవిత కుమారుడి పరీక్షలు ఉన్నందున బెయిల్ ఇవ్వాలని సింఘ్వీ వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 45ను సింఘ్వీ ప్రస్తావించారు. ప్రీతిచంద్ర కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును కూడా సింఘ్వీ ప్రస్తావించారు.
ఈడీ తరుపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ కవితకు బెయిల్ ఇవ్వకూడదని కోర్టుకు విన్నవించారు. లిక్కర్ కేసులో కవిత కీలకంగా ఉన్నారని.. లిక్కర్ కేసులో లంచాలు ఇచ్చిన వ్యక్తుల్లో కవిత ఒకరని అన్నారు. లంచాలు ఇవ్వడం ద్వారా కవిత లబ్దిపొందాలని ప్రయత్నించారని కోర్టుకు వివరించారు. కవిత వాడిన ఫోన్లులో డేటాను డిలిట్ చేశారని... ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత డేటాను డిలిట్ చేశారని జోయబ్ హుస్సేన్ కోర్టుకు తెలిపారు.