Gold Scheme: అదిరిపోయే వార్త చెప్పి ప్రభుత్వం..కల్యాణ లక్ష్మీ, ఇంటింటికీ తులం బంగారం ఇచ్చేది ఎప్పుడంటే?
Gold Scheme: రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఎన్నికల సమయంలో చచ్చిన మరో కీలక హామీపై మంత్రి శ్రీధర్ బాబు మరో కీలక ప్రకటన చేశారు. కల్యాణీ లక్ష్మీ స్కీములో భాగంగా ఇంటింటికీ తులం బంగారం ఎప్పుడు అందిస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారికంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఒక్కొఒక్కోటిగా అమలు చేస్తూ వస్తోంది. అయితే ఇప్పటి వరకు కొన్ని హామీలను మాత్రమే అమలు చేసిన సర్కార్..ప్రజలు ఎదురుచూస్తున్న కొన్ని కీలక పథకాలను ఇంకా అమల్లోకి తీసుకురాలేదు. వీటిలో కల్యాణ లక్ష్మీ లబ్దిదారులకు తులం బంగారం ఇవ్వడం కూడా ఒకటి.
ఈ విషయంపై మంత్రి శ్రీధర్ బాబు వివరణ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కొటిగా అమలు చేస్తూన్నాము. కానీ కొన్ని పథకాలను అమలు చేసేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఇంటింటికి తులం బంగారంపై కూడా క్లారిటీ ఇచ్చారు మంత్రి.మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం వంటి స్కీములను ప్రారంభించి..ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. కానీ తులం బంగారం, ప్రతి కుటుంబానికి రూ. 2500 చదువుకునే యువతులకు స్కూటీలు వంటి హామీలు ఇంకా అమల్లోకి రాకపోవడం కూడా విమర్శలకు దారితీస్తోంది.
తులం బంగారం వంటి స్కీములను కొంత సమయం పడుతుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇది త్వరలో అమల్లోకి రాకపోవచ్చని తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో కూడా కాంగ్రెస్ సర్కార్ ఈ పథకం ఊసేత్తే ఆలోచనలో లేనట్లే తెలుస్తోంది. తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ స్కీమును అమలు చేస్తే..మరోసారి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అందుకే ఈ స్కీము అంత త్వరగా ప్రారంభించే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.