JaggaReddy: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ నిధులను రూ.2 లక్షలకు పెంచాలి
JaggaReddy: నిరుపేదల పెళ్లిళ్లకు మీరిచ్చే నిధులు సరిపోవడం లేదు
JaggaReddy: రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు చాలా మంది నిరుపేదల కుటుంబాల్లో పెళ్లిళ్లకు ఆసరాగా నిలుస్తున్నాయని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ధనవంతులు బంగారం కొనుక్కుని, ఆడంబరంగా పెళ్లి చేస్తారని కానీ నిరుపేదలు పెళ్లి చేయాలంటే ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చుకోవాల్సి వస్తోందని ప్రస్తుతం ఇస్తోన్న లక్షా 16 వేల రూపాయలు ఇవ్వడం అభినందించ దగ్గ విషయమేనని, కానీ ఈ డబ్బు నిరుపేదలకు సరిపోవడం లేదన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఇస్తున్న లక్షా 16 వేలకు నుంచి రెండు లక్షలకు పెంచాలని జగ్గారెడ్డి కోరారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.