Bhatti Vikramarka: పెద్దపల్లి జిల్లా బహ్మణపల్లిలో కల్లు తాగిన భట్టి
Bhatti Vikramarka: తాటికల్లు రుచి చూసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
Bhatti Vikramarka: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తాటి కల్లు రుచి చూశారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం బహ్మణపల్లి గ్రామంలో గౌడ సామాజికవర్గం వారితో కలిసి తాటికల్లు తాగారు భట్టి విక్రమార్క. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా... ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారాయన. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ..బాధితులకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.. ఈ క్రమంలోనే బహ్మణపల్లి గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. గీత కార్మికులు కల్లు తాగాల్సిందిగా భట్టిని కోరడంతో.. అక్కడి వారితో కలిసి ఓ పట్టుపట్టి ఖుషి అయ్యారు సీఎల్పీ నేత.