కాళేశ్వరం కమిషన్‌ను కలిసిన రిటైర్డ్ ఇంజనీర్ల బృందం
కమిషన్‌కు రిపోర్ట్ సమర్పించిన రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ బృందం కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ ఘోష్ తో సమావేశమై అప్పటి రిపోర్ట్ ను సమర్పించింది. కేసీఆర్ సూచనల మేరకే మేడిగడ్డ నిర్మాణం జరిగిందని ఆ రిపోర్టులో పేర్కొంది. అఫిడవిట్ల పరిశీలన పూర్తయిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రారంభించిన కాళేశ్వరం కమిషన్..అసిస్టెంట్ డిప్యూటీ ఇంజనీర్లను పిలవాలా? వద్దా? అనే అంశంపై కసరత్తు చేస్తోంది. ఓపెన్ కోర్టులోనే మరోసారి అందరిని క్రాస్ ఎగ్జామింగ్ చేసే అవకాశముంది.
మరోవైపు సబ్ కాంట్రాక్ట్ వ్యవస్థపైనా ఫోకస్ పెట్టిన కమిషన్..మూడు బ్యారేజీల సబ్ కాంట్రాక్ట్ లను గుర్తించి..వాటి వివరాలనూ సేకరించే పనిలో పడింది. ఇందులో భాగంగా.. కాంట్రాక్ట్ ఏజెన్సీ అకౌంట్స్, స్టేట్ మెంట్స్ పరిశీలించే అవకాశముంది. తాను పిలిస్తే ఎవరైనా విచారణకు రావాల్సిందేనని...రాకపోతే తనకు చర్యలు తీసుకునే అధికారాలున్నాయని జస్టిస్ ఘోష్ తెలిపారు.