బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిని కలిసిన కేఏ పాల్‌..

KA Paul: ప్రచారం చేస్తున్న రాజగోపాల్‌రెడ్డిని చూసి ఆగిన కేఏపాల్

Update: 2022-10-17 05:19 GMT

బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిని కలిసిన కేఏ పాల్‌..

KA Paul: మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కలిశారు. రాజగోపాల్‌రెడ్డి ప్రచారం చేస్తుండగా... అదే సమయంలో చండూరు ఆర్‌వో ఆఫీస్‌కు వస్తున్న కేఏ పాల్ రాజగోపాల్‌ను చూసి ఆగి కలిశారు. రాజగోపాల్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చి అభివాదం చేశారు. పాల్ ని చూడగానే బిజెపి కార్యకర్తలు కేరింతలతో జై బిజెపి జై బిజెపి అంటూ నినాదాలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ రెండు సెట్లు దాఖలు చేయగా ఒక సెట్టు రిజెక్ట్ అయిందని... మరో సెట్ కన్ఫామ్ అయిందని కేఏ పాల్ చెప్పారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటానని... హెలికాప్టర్ గుర్తు ఆశిస్తున్నట్లు కేఏ పాల్ చెప్పారు.

Tags:    

Similar News