Congress: రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా

Congress: రాజ్యసభ సభ్యత్వానికి కే కేశవరావు రాజీనామా చేశారు.

Update: 2024-07-04 07:26 GMT

Congress: రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా

Congress: రాజ్యసభ సభ్యత్వానికి కే కేశవరావు రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌ జగ్దీప్ దన్‌‌ఖర్‌ను కలిసి..తన రాజీనామా లేఖను సమర్పించారు కేకే. బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలోనే..ఆ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

బుధవారం ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో కేకే పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపదాస్ మున్షీ, సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, మధు యాష్కీ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News