Hyderabad: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వీరంగం.. ఓ ఇంట్లోకి చొచ్చుకెళ్లి..
Jubilee Hills:జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వీరంగం సృష్టించాడు.
Jubilee Hills: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వీరంగం సృష్టించాడు. ఓ వ్యక్తి ఇంటి మీదకు తన అనుచరులతో వెళ్లి దాడి చేశారు. ఆదివారం బోనాల వేడుకల సందర్భంగా హైదరాబాద్ వెంగళరావ్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫోటో ఎందుకు పెట్టలేదంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంగళరావు నగర్‌లో తన అనుచరులతో కలిసి గణేశ్ అనే వ్యక్తి ఇంటిపై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దాడి చేశారు. అయితే మాగంటి గోపీనాథ్ అనుచరులు దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.