రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. నెల్లూరు జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించారు. నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చేందుకు వచ్చానని వెల్లడించారు. నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు కన్నీరు పెడితే రష్ట్రానికి మంచిది కాదని స్పష్టం చేశారు.
గ్రేటర్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అద్భుతంగా రాణించినందుకు నాయకులకు పవన్ అభినందనలు తెలిపారు. బీజేపీకి గెలుపునకు సహకరించిన జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన 68 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణియించిందని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీలో బీజేపీ, జనసేన కలిసి పనిచేశాయని పవన్ స్పష్టం చేశారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పని చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. అభ్యర్థి ఎవరు అనేది సమన్వయ కమిటీ నిర్ణయింస్తుందని వెల్లడించారు.