24గంటల్లోనే 22 ప్రసవాలు చేసి రికార్డు సృష్టించిన జనగామ ఆరోగ్యకేంద్రం..

జనగామ మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో కేవలం 24 గంటల్లోనే 22 ప్రసవాలు చేసి డాక్టర్లు రికార్డు సృష్టించారు. 17 సాధారణ ప్రసవాలు, ఐదు సిజేరియన్లు చేసి ఆరుదైనా రికార్డు సొంతం చేసుకున్నారు.

Update: 2019-09-21 07:54 GMT

జనగామ మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో కేవలం 24 గంటల్లోనే 22 ప్రసవాలు చేసి డాక్టర్లు రికార్డు సృష్టించారు. 17 సాధారణ ప్రసవాలు కాగా, ఐదు సిజేరియన్లు మాత్రమే చేసి ఆరుదైనా రికార్డు సొంతం చేసుకున్నారు.గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు వైద్యులు మొత్తం 22 ప్రసవాలు చేయగా.. అందులో ఐదు మాత్రమే సిజేరియన్‌ ఆపరేషన్లు. మిగతా 17 సాధారణ ప్రసవాలు కావడం విశేషం. దీంతో గర్భిణులకు సాధారణ ప్రసవాలపై ఉన్న అపనమ్మకాలను తొలగిస్తూ.. ఎంసీహెచ్‌ వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కాన్పుల్లో తల్లీబిడ్డలందరూ క్షేమంగా ఉన్నారని 17 మందిలో 16 మంది తొలి కాన్పుకు వచ్చిన వారేనని వైద్యులు వెల్లడించారు. డాక్టర్‌ ప్ర ణీతను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఏ మహేందర్‌, దవాఖాన పర్యవేక్షకుడు డాక్టర్‌ పీ రఘు, ఆర్‌ఎంవో డాక్టర్‌ సుగుణాకర్‌రాజు వై ద్యురాలి సేవలను అభినందించారు. ఇన్ని కాన్పులు చేసిన వైద్య సిబ్బందిని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అభినందించారు. 

Tags:    

Similar News