Bandi Sanjay: బండి సంజయ్‌కి 7917 నెంబర్‌ను కేటాయించిన జైలు అధికారులు

Bandi Sanjay: ఇవాళ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌‌పై విచారణ

Update: 2023-04-06 04:00 GMT

Bandi Sanjay: బండి సంజయ్‌కి 7917 నెంబర్‌ను కేటాయించిన జైలు అధికారులు 

Bandi Sanjay: తెలంగాణలో టెన్త్ పేపర్ లీక్ రగడ రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. బీజేపీ స్టే్ట్ చీఫ్ బండి సంజయ్ అరెస్టుతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. నిన్న సంజయ్ ని నాటకీయ పరిణామాల మధ్య కరీంనగర్ జైలుకు తరలించారు. సంజయ్ ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని కాషాయ శ్రేణులు మండిపడుతున్నాయి. నిన్న హైకోర్టుకు సెలవు కావడంతో హెబియస్ కార్పస్ పిటిషన్ ను జడ్జి ఇంటి వద్దనే విచారణ చేయాలని కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది బీజేపీ. సంజయ్ ను తక్షణమే కోర్టులో హాజరుపర్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని హెబియస్ కార్పస్ పిటిషన్ లో కోరింది.

అయితే సంజయ్‌ అరెస్టు చూపించి, రిమాండ్‌కు పంపుతున్నట్లు అడ్వకేట్‌ జనరల్‌ కార్యాలయం సమాచారం ఇవ్వడంతో హౌస్‌మోషన్‌ పిటిషన్ విచారణకు చీఫ్‌ జస్టిస్‌ నిరాకరించారు. దీనిపై న్యాయమూర్తి ఇవాళ మొదటి కేసుగా విచారణ చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.

కరీంనగర్ జైలు వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. బీజేపీ శ్రేణులు ఆందోళనలకు దిగుతారన్న సమాచారంతో భద్రతను పటిష్టం చేశారు. దీంతో జైలు పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రాత్రి కరీంనగర్ జైలులో బండి సంజయ్‌కి జైలు అధికారులు మెడికల్ చెకప్ చేశారు. బండికి సంజయ్‌కి 7917 నెంబర్‌ను జైలు అధికారులు కేటాయించారు. ఈ రోజు ములాఖత్‌లో బండి సంజయ్ కుటుంబసభ్యులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో బండి సంజయ్‌కి బెయిల్ కోసం బీజేపీ నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

ఇటు బండి సంజయ్ పిటిషన్‌పై హన్మకొండ కోర్టులో ఇవాళ వాదనలు జరగనున్నాయి. దీంతో బండి బెయిల్‌పై ఉత్కంఠ నెలకొంది. నిన్న కోర్టు బండి సంజయ్‌కి ఈ నెల 19 వరకూ 14 రోజుల రిమాండ్ విధించడంతో.. ప్రస్తుతం కరీంనగర్ జైలులో ఉన్న బండి సంజయ్‌ని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు సంజయ్ తరపు లాయర్లు.. హన్మకొండ జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ వాదనలు జరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత బండి సంజయ్‌ని హన్మకొండ తరలించే అవకాశం ఉన్నట్ల సమాచారం. బండి బెయిల్‌ పిటిషన్‌పై మధ్యాహ్నం లోగా క్లారిటీ రానుంది. ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను బీజేపీ లీగల్ సెల్ దాఖలు చేయనుంది.   

Tags:    

Similar News