IT Raids: బీఆర్‌ఎస్ నేతలపై రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు
IT Raids: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి నివాసాల్లో సోదాలు
IT Raids: బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల ఇళ్లపై రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కొత్తపేట్ గ్రీన్ హిల్స్ కాలనీలోని శేఖర్ రెడ్డి నివాసంలో నిన్నటి నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. జేసీ బ్రదర్స్ షోరూమ్స్‌తో పాటు అమీర్‌పేట్ కార్పొరేట్ ఆఫీస్‌లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
జేసీ స్పిన్నింగ్ మిల్స్, జేసీ హోల్డింగ్స్ పేర్లతో మర్రి జనార్ధన్ రెడ్డి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కొత్తూరు పైపుల కంపెనీలో సైతం ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పైళ్ల శేఖర్ రెడ్డి బ్యాంకు లాకర్స్‌ను ఐటీ అధికారులు ఓపెన్ చేశారు. అయితే కుట్రపూరితంగానే ఐటీ సోదాల చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.