IT Raids: బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు
IT Raids: తెలంగాణలో ఐటీ దాడుల కలకలం
IT Raids: తెలంగాణలో ఐటీ దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతల ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇంటితో పాటు కార్యాలయాల్లోనూ దాడులు చేపట్టారు. ఆయన నివాసం ముందు కేంద్ర బలగాలు పహారా కాస్తుండగా.. అధికారులు సోదాలు చేపట్టారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై కూడా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కొత్తపేట్ గ్రీన్‌హిల్స్ కాలనీలోని MLA ఇల్లు, ఆఫీస్‌లలో ఐటీ సోదాలు జరగుతున్నాయి.
నాగర్‌కర్నూలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జేసీ బ్రదర్స్‌లో జరిగిన లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.