IT And ED Raids: మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు..
IT And ED Raids: కరీంనగర్ జిల్లాలో సోదాలు చేపడుతున్న ఈడీ, ఐటీ అధికారులు మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోకి ప్రవేశించారు.
IT And ED Raids: కరీంనగర్ జిల్లాలో సోదాలు చేపడుతున్న ఈడీ, ఐటీ అధికారులు మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోకి ప్రవేశించారు. ముందుగా ఇంటికి తాళాలు వేసి ఉండటంతో తాళాలు తీసే వ్యక్తిని తీసుకొచ్చి మరీ డోర్లు తెరిచారు. ఆ తర్వాత లోనికెళ్లిన అధికారులు సోదాలు చేపట్టారు. ఈ ఉదయం నుంచి హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌లో సోదాలు చేపట్టిన అధికారులు పలువురు గ్రానైట్ కంపెనీల యజమానుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేపట్టారు. ఐటీ, ఈడీ అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఈ జాయింట్ ఆపరేషన్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.