Disha Case: సజ్జనార్ కు ప్రశ్నల వర్షం.. పాత వీడియో క్లిప్పులు చూపిస్తూ ఇంటరాగేషన్..

Disha Case: దిశా ఎన్‌కౌంటర్‌ కేసులో అప్పటి సీపీ సజ్జనార్‌ను కమిషన్ విచారిస్తోంది.

Update: 2021-10-12 10:26 GMT

Disha Case: సజ్జనార్ కు ప్రశ్నల వర్షం.. పాత వీడియో క్లిప్పులు చూపిస్తూ ఇంటరాగేషన్..

Disha Case: దిశా ఎన్‌కౌంటర్‌ కేసులో అప్పటి సీపీ సజ్జనార్‌ను కమిషన్ విచారిస్తోంది. సజ్జనార్‌ను పలు కీలక ప్రశ్నలను సంధించింది. అనాటి ప్రెస్‌మీట్‌లో సజ్జనార్‌ మాట్లాడిన వీడియోలను చూపిస్తూ పలు ప్రశ్నలు వేస్తోంది. పోలీసుల వద్ద నుంచి దిశా నిందితులు వెపెన్స్ లాక్కున్నారని అప్పట్లో సజ్జనార్ తెలిపారు. అయితే వెపన్స్ ఎందుకు అన్‌లాక్‌ చేశారని కమిషన్‌ ప్రశ్నించింది. ప్రెస్‌మీట్‌ సమయానికి బాధితురాలి వస్తువులు రికవరీ కాకపోయినా రికవరీ అయినట్లు ఎందుకు చెప్పారని కమిషన్‌ ప్రశ్నించింది.

వెపన్స్ పూర్తికాకుండా పోస్ట్‌మార్టం పూర్తికాకుండా ప్రెస్‌మీట్‌ ఎందుకు పెట్టారని కమిషన్‌ అడిగింది. ఇంక్వేస్ట్‌ ను ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ ముందు చేయమని ఎవరు చెప్పారని కమిషన్‌ సజ్జనార్‌ను ప్రశ్నించింది. 2008లో వరంగల్‌ యాసిడ్‌ దాడి నిందితుల ఎన్‌కౌంటర్, 2016లో నక్సలైట్ల ఎన్‌కౌంటర్, 2019లో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో ఒకరకమైన విధానం కనిపిస్తుందని కమిషన్‌ సజ్జనార్‌ను ప్రశ్నించింది.

Tags:    

Similar News