TSRTC: పెరిగిన ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య.. రూ.4.50 కోట్లు పెరిగిన రోజువారీ ఆదాయం

TSRTC: మహాలక్ష్మి పథకానికి భారీ స్పందన

Update: 2023-12-18 07:10 GMT

TSRTC: పెరిగిన ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య.. రూ.4.50 కోట్లు పెరిగిన రోజువారీ ఆదాయం

TSRTC: మహాలక్ష్మి పథకం ఆర్టీసీ బస్సులపై పెద్ద ప్రభావమే చూపుతోంది. నిత్యం 13 లక్షల మేర ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అదనంగా ప్రయాణిసున్న వారిలో 90 శాతం మహిళలే ఉంటున్నారు. ఈ రూపంలో ఆర్టీసీకి రోజువారీ ఆదాయం దాదాపు 4 కోట్ల 50 లక్షలు పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నందున టికెట్‌ రూపంలో నేరుగా ఆర్టీసీకి ఆదాయం తగ్గుతుంది తప్ప పెరగదు.

కానీ ఈ పథకంతో ఆర్టీసీ కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వం రీయింబర్స్‌ చేయనున్నందున ఆ రూపంలో అదనపు ఆదాయం వచ్చి పడుతుంది. గతంలో సాధారణ రోజుల్లో ఆర్టీసీకి నిత్యం 13–14 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుండగా, ఇప్పుడది 18 కోట్ల 25 లక్షలకు పెరిగింది..గతంలో సాధారణ రోజుల్లో నిత్యం బస్సుల్లో 25 నుంచి 30 లక్షల మధ్య ప్రయాణించేవారు. ఇప్పుడది 43 లక్షలు దాటుతోంది. ఈ పథకం ప్రారంభమయ్యాక 40 శాతం ప్రయాణికులు పెరిగనట్టు గుర్తించారు.

మూడు రోజుల క్రితం జీరో టికెట్ల జారీ ప్రక్రియ మొదలుపెట్టారు. మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించారో ఆ టికెట్ల జారీతో తేలుతుంది. దానికి ఎంత చార్జీ చెల్లించాల్సి ఉంటుందో కూడా అందులో స్పష్టమవుతుంది. ఆర్టీసీ ఆ లెక్కలను ప్రతినెలా ప్రభుత్వానికి అందిస్తుంది. దాని ఆధారంగానే ఆ మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తుంది.

Tags:    

Similar News