Telangana: సంక్రాంతి తరువాత కొత్త సచివాలయ భవనం ప్రారంభం
Telangana: శరవేగంగా కొనసాగుతున్న సచివాలయ భవనం పనులు
Telangana: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయ నూతన భవనం పనులు శరవేగంగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలకనుగుణంగా పనులు వేగవంతం చేశారు. పెద్ద సంఖ్యలో సిబ్బంది రాత్రి పగలు తేడా లేకుండా పనుల్లో నిమగ్నమయ్యారు. భారీ గుమ్మటాలపై జాతీయ చిహ్నాన్ని అమర్చారు. ఫ్లోరింగ్ సహా ఇతర అంతర్గత పనులు కొనసాగుతున్నాయి. సంక్రాంతి తరువాత తెలంగాణ నూతన సచివాలయ భవనం ప్రారంభం కానుంది.
భవనంపై 34 గుమ్మటాలు ఏర్పాటు చేశారు. రెండు భారీ గుమ్మటాల కాంక్రీట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో వాటిపై జాతీయ చిహ్నాలను అమరుస్తున్నారు. భవనం ముందు వైపున ఉన్న భారీ గుమ్మటంపై జాతీయ చిహ్నాన్ని అమర్చారు. ఐదు టన్నుల బరువు ఉండే ఈ కాంస్య చిహ్నాన్ని ఢిల్లీలో ప్రత్యేకంగా సిద్ధం చేయించారు.