Munugode: మునుగోడులో ప్రలోభాల పర్వం

Munugode: ప్రజల ప్రసన్నం కోసం పార్టీల పాట్లు, ఇప్పటి నుంచే గిఫ్ట్‌లతో ఓటర్లకు గాలం

Update: 2022-09-05 05:39 GMT

Munugode: మునుగోడులో ప్రలోభాల పర్వం 

Munugode: రాబోయే మునుగోడు ఉప తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాఫిక్‌గా మారింది. ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే జంపింగ్ జపాంగ్‌లకు గాలం వేస్తూ తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ఇక ప్రలోభాల పర్వం మూడు పువ్వులు ఆరు లకారాలుగా సాగుతుండడంతో ఇప్పుడు అందరి దృష్టి మునుగోడు వైపు పడింది.

ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మునుగోడులో తాయిలాలు తారాస్థాయికి చేరాయి. ప్రధాన పార్టీలన్నీ లీడర్లతో పాటు ఓటర్ల కొనుగోలుపై ఫోకస్ పెంచాయి. ఒక్కో ఓటు ఒక్కో పార్టీ పదివేలు ఇస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ సైతం ఓటుకు పదివేలు ఇవ్వబోతుందన్న చర్చ హాట్ హాట్ నడుస్తోంది. దీంతో ఈ నియోజకవర్గానికి చెంది, ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్న వారందరి దృష్టి ఇప్పుడు మునుగోడు బై పోల్ పై పడింది. ఉప ఎన్నిక నేపథ్యంలో వారంతా మునుగోడు నియోజకవర్గంలో ఓటు నమోదుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు తమ ఓట్లను మునుగోడుకు బదిలీ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఓటు హక్కు రానివారు పెద్ద ఎత్తున ఓటుకోసం దరఖాస్తు చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆగస్టు 2 నుంచి ఈ నెల రెండో తేదీ వరకు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో సుమారు 13 వేల మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి 8 వేల మందికి పైగా అర్జీలు మునుగోడుకు బదిలీ చేసుకోవడం సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రాబోయే రోజుల్లో ఇంకా ఓట్ల నమోదు సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఓట్ల నమోదు కోసం దరఖాస్తులు వస్తోన్న నేపధ్యంలో పరిశీలన బాధ్యతలు బూత్ లెవల్ అధికారులకు కాకుండా సూపర్ వైజర్లు, తహశీల్దార్‌లకు అప్పగించాలని బై పోల్ వ్యవహారం చూస్తోన్న నల్గొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు స్థానికంగా ఉంటున్నారా..? మునుగోడులో ప్రలోభాల పర్వం ప్రజల ప్రసన్నం కోసం పార్టీల పాట్లు ఇప్పటి నుంచే గిఫ్ట్‌లతో ఓటర్లకు వారు జతచేసిన ధ్రువీకరణ పత్రాలు సరైనవేనా...వయస్సు ఇతర సమాచారం క్షుణ్ణంగా పరిశీలించాలని ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు.

Tags:    

Similar News