Battle Tanks : కాస్త అవకాశం దొరికితే చాలు మన దాయాది దేశాలు ఎప్పుడెప్పుడు మన దేశంపైన దండెత్తుదామా అని చూస్తూ ఉంటాయి. భారత సైన్యాన్ని రెచ్చగొట్టే విధంగా కవ్వింపు చర్యలు, చాటుమాటున దుశ్చర్యలు చేస్తూ రెచ్చగొడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే భారత్ తన ఆయుధ సంపత్తిని సృష్టించుకుంటున్నది. ఒకటి కాదు రెండు ఏకంగా 1,094 కోట్ల రూపాయలతో 156 ఇన్‌ఫాంట్రీ కాంబాట్ వెహికిల్ (ఐసీవీ) బీఎంపీ-2 యుద్ధట్యాంకులను భారత్ నే తయారుచేస్తున్నది. ఈ క్రమంలోనే మెదక్ ఓడీఎఫ్ జనరల్ మేనేజర్ అలోక్ ప్రసాద్ సంగారెడ్డిజిల్లా కంది మండలంలోని ఓడీఎఫ్‌లో తయారవుతున్న ఐసీవీ బీఎంపీ-2గా పిలిచే ట్యాంకుల తయారీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దేశ రక్షణ రంగానికి ఇప్పటికే ఎన్నో యుద్ధట్యాంకులు, అధునాత యంత్రాలను అం దించిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (ఓడీఎఫ్) ఇప్పుడు ఈ ట్యాంకుల తయారీలో నిమగ్నమై ఉందని స్పష్టం చేసారు. ఇది పూర్తి స్థాయిలో బుల్లెట్ ఫ్రూఫ్ ట్యాంక్ అని తెలిపారు. రక్షణ యుద్ధ ట్యాంకుల్లో భాగంగా మొదటిసారి ఓడీఎఫ్‌లోనే.. బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు తయారుకావడం విశేషమని వెల్లడించారు.
Battle Tanks : ఇప్పటికే రక్షణశాఖకు అధునాత యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను ఓడీఎఫ్ తయారుచేసి ఇచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా మరికొన్ని యుద్ద ట్యాంకును తయారు చేస్తుంది. దీని తయారి కోసం కేంద్రం రూ.1,094 కోట్లు వెచ్చిస్తున్నది. కాగా 156 యుద్ధ ట్యాం కుల తయారీకి ఐసీవీకి జూన్‌లో ఓడీఎఫ్‌కు ఆర్డర్ వచ్చింది. ఇవి రష్యాకు చెందిన బోయివయ మాషిన పెహోటి 2/2కే వంటి యుద్ధ ట్యాంకులని తెలిపారు. జూన్ 2న కేంద్ర రక్షణశాఖ కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో ట్యాంకులను ఆగస్టు మొదటివారం నుంచి పరిశ్రమలో తయారీని ప్రారంభించారు. తయారైన ట్యాంకులను పరిశ్రమల ఆవరణలోనే అన్ని రకాలుగా పరీక్షలు చేస్తున్నట్టు అలోక్ ప్రసాద్ చెప్పారు.
ఐసీవీ బీఎంపీ-2 ప్రత్యేకతలు
అగ్ని నుంచి పూర్తి రక్షణ దీని ప్రత్యేకత
నీటిలో వేగం గంటకు 7కిలోమీటర్లు
35 డిగ్రీల కోణంలో వచ్చే అడ్డంకులను సునాయాసంగా అధిగమిస్తుంది
300 హార్స్ పవర్ ఇంజిన్
భూమిపై ప్రయాణ వేగం గంటకు 70 కిలోమీటర్లు
నావిగేషన్, రేడియో సెట్, ఇతర డిజిటల్ సౌకర్యాలు.