Mahalakshmi Scheme: మహిళలకు అలర్ట్..వారికి మాత్రమే ప్రతినెలా రూ.2,500.!

Mahalakshmi Scheme: ప్రతినెలా రూ. 2,500 పొందే పథకంపై కీలక అప్ డేట్. ఎవరెవరికి ఎప్పటి నుంచి డబ్బులు వస్తాయో పూర్తి వివరాలు తెలుసుకోండి.

Update: 2024-06-20 00:43 GMT

 Mahalakshmi Scheme: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరస్తూ వస్తోంది. అందులో ఇప్పటికే కొన్ని అమలు చేస్తోంది. ఇంకొన్ని త్వరలోనే అమలు కానున్నాయి. ముఖ్యంగా మహిళల కోసం కాంగ్రెస్ ఎన్నికల్లో వరాల జల్లులు కురిపించిన సంగతి తెలిసిందే. వీటిలో ప్రతినెలా రూ.2500 చెల్లిస్తామని చెప్పింది. మహిళలకు ప్రతినెలా రూ. 2,500 అందించే స్కీముపై సీతక్క, పొన్నం ప్రభాకర్ అదిరేపోయే అప్ డేట్ ను ఇచ్చారు.

అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళలకు రూ. 2500 చొప్పున అందిస్తామని ప్రకటించారు. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. అంతేకాదు పలు అంశాలకు సంబంధించిన కీలక అప్ డేట్ కూడా ఇచ్చారు. మహిళలకు రూ. 2500 పథకానికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలను రెడీ చేశారు. త్వరలోనే ఈ స్కీంను అమలు చేస్తామని ప్రకటించారు. ఈ హామీలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కీలక ప్రకటన చేశారు.

రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళా అకౌంట్లో నెలనెలా రూ. 2500 జమ అవుతాయని మంత్రి స్పష్టం చేశారు. మహిళలకు ఆర్థిక సాయం విషయంలో తమ సర్కార్ ఆచితూచి వ్యవహారిస్తోందని తెలిపారు. ఇంకా పథకానికి సంబంధించిన కీలక అంశాన్ని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నెలనెలా రూ. 2500 రూపాయలు అందేలా నిబంధనలు తీసుకువస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ఈ స్కీంను జులై నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇక కాంగ్రెస్ సర్కార్ తీసుకువచ్చని ఫ్రీ బస్ జర్నీ మంచి సక్సెస్ అని చెప్పవచ్చు. అయితే రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకంపై మాత్రం ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరికే ఈ స్కీమ్ వర్తిస్తోందని ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటోంది. చాలా మందికి ఇప్పటికీ రేషన్ కార్డులు లేవు.ఇంకా కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో తెలియదు. ప్రభుత్వం మాత్రం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని చెబుతూనే ఉంది. 

Tags:    

Similar News