హైదరాబాద్‌లోని నిమజ్జన కొలువుల్లో అపరిశుభ్రత

Update: 2020-08-27 05:04 GMT

Immersions of Ganesh Statues in Unclean Pools: హైదరాబాద్‌ నగరంలో వినాయక విగ్రహాల నిమజ్జనంతో చెరువులు కలుషితం కాకుండా జీహెచ్ఎంసీ నిమజ్జన కొలనులు నిర్మించింది. లక్షలాది రూపాయల వ్యయం చేసి నిర్మించిన ఈ కొలనులు ఇప్పుడు నిర్వహణ లేక మురికి కూపాలుగా మారాయి. దీంతో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లోనే విగ్రహాల్ని నిమజ్జనం చేయాల్సి వస్తుందని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రంగా పూజించిన దేవున్ని ఇలా నిమజ్జనం చేయడం బాధగా ఉందంటున్నారు.

హైదరాబాద్‌లో వినాయక విగ్రహాలతో చెరువులు కాలుష్యమవుతుండటంతో గతేడాది జీహెచ్‌ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నగరంలో 23 నిమజ్జన కొలనులను నిర్మించింది. ఈ ఏడాది ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవటంతో అవే కొలనుల్లో నిమజ్జనం చేస్తున్నారు భక్తులు. అయితే ఈ కొలనుల నిర్మాణం పట్ల ప్రజల నుంచి సానుకూలస్పందన వచ్చినా ఇప్పుడు వీటి నిర్వహణను గాలికొదిలేయండంతో అవి అపరిశుభ్రంగా తయారై దుర్గంధం వెదజల్లుతున్నాయి.

నిమజ్జన కొలువుల దగ్గర నిర్వహణ లేకపోవటంతో చాలా చోట్ల అవి మురికి కూపాలుగా మారిపోయాయి. దీంతో విగ్రహాలనిమజ్జనం అపరిశుభ్రమైన నీటిలోనే జరుగుతుంది. ఇప్పటికీ చాలా చోట్ల వినాయక ప్రతిమలు కుంటల్లోనే ఉండిపోయాయి. వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే కొలనుల్లో నెలకొన్న అపరిశుభ్రత వాతావరణం పట్ల కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పవిత్రమైన నిమజ్జనం కార్యక్రమం నిర్వహించే కొలనులు శుభ్రంగా లేకపోవటంతో అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నిమజ్జన కొలనులతో పాటు చెరువుల పరిస్థితి కూడా అలాగే ఉండటంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు ప్రభుత్వం నిమజ్జనాలకు అనుమతి లేదని స్ఫష్టం చేసినా అపార్ట్ మెంట్లు,కాలనీల్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాల నిమజ్జనాలకు భక్తులు తరలిస్తున్నారు. మరోవైపు నిమజ్జన కొలువుల్లో చెత్త పేరుకుపోయి దోమల బెడద పెరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కొలనులను శుభ్రం చేయాలని కోరుతున్నారు.

Full View



Tags:    

Similar News