Amrapali Kata Appointed In PMO : యువ ఐఏఎస్ అధికారిణి అమ్రపాలి తెలియని వారు ఉండరు. ఈమె ఏ జిల్లాల్లో విధులు నిర్వర్తించినా అక్కడ మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుని మంచి గుర్తింపు తెచ్చకున్నారు. ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న ఆమెకు ఇప్పుడు మరో కీలక అవకాశం లభించింది. ప్రధానమంత్రి అధికారి (పిఎంఓ) లో ఐఎఎస్ అధికారి అమ్రపాలి కటాను శనివారం డిప్యూటీ సెక్రటరీగా నియమించారు. పీఎంవోలో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు.
ఆమ్రపాలి 2023 అక్టోబర్ 27 వరకు ప్రధాని కార్యాలయంలో విధులునిర్వహించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశాఖపట్నంలో జన్మించిన ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడర్ 2010 బ్యాచ్‌కు చెందినవారు. ఈమె వికారాబాద్ సబ్ కలెక్టర్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్, తెలంగాణ ఎన్నికలకు సంయుక్త సిఇఒగా పనిచేశారు. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి జి కిషన్ రెడ్డి ప్రైవేట్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.
ఇక పోతే రఘురాజ్ రాజేంద్రన్, ఆమ్రపాలి, మంగేష్ గిల్డియాల్ అనే ముగ్గురు ఐఎఎస్ అధికారుల నియామకాలను కేబినెట్ నియామక కమిటీ (ఎసిసి) క్లియర్ చేసింది. మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన రఘురాజ్ రాజేంద్రన్‌ను డైరెక్టర్‌గా, ఆంధ్రప్రదేశ్ కేడర్‌లోని అమ్రపాలిని డిప్యూటీ సెక్రటరీగా, ఉత్తర ప్రదేశ్ కేడర్‌కు చెందిన మంగేష్ గిల్దియాల్‌ను అండర్ సెక్రటరీగా నియమించారు. కేబినెట్ నియామక కమిటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహిస్తారు. హోం వ్యవహారాల మంత్రి అమిత్ షా దాని సభ్యుడు.