ED Inquiry: భూదాన్ భూముల బదిలీ.. ఈడీ విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్
Hyderabad: ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ హాజరయ్యారు. మీడియా కంటపడకుండా ఉదయం ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
Hyderabad: ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ హాజరయ్యారు. మీడియా కంటపడకుండా ఉదయం ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. 50 ఎకరాల భూదాన్ భూములు అన్యాక్రాంతం అయినట్లు అధికారులు గుర్తించారు. విజిలెన్స్ విచారణలో భూదాన్ భూముల భాగోతం బట్టబయలైంది. ఇదే వ్యవహారంలో నాటి ఎమ్మార్వో జ్యోతిపై కేసునమోదు చేశారు. జ్యోతిపై కేసునమోదైన తర్వాత విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు.
విజిలెన్స్ విచారణ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించి.. నాడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న అమోయ్ కుమార్‌కి నోటీసులు ఇచ్చారు. నాగారంలోని సర్వే నెంబర్ 181, 182లోని 102.2 ఎకరాలపై వివాదం ఉంది. ఇందులో 50 ఎకరాల భూమి భూదాన్‌కి చెందినదిగా బోర్డ్ వాధిస్తోంది.