Hyderabad: పార్కింగ్ పేరుతో దోపిడీ

Hyderabad: ఇష్టానుసారం పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్న మాఫియా

Update: 2021-02-21 07:48 GMT
ఫైల్ ఇమేజ్ 

Telangana: హైదరాబాద్ మహానగరంలో పార్కింగ్ దోపిడి యథేచ్చగా సాగుతోంది. వాహనాన్ని బట్టి నచ్చిన రేటు ఫీక్స్ చేస్తు సామాన్యులను దోపిడికి గురిచేస్తుంది పార్కింగ్ మాఫీయా. గంట గంటకు రేట్లను పెంచుతు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు పార్కింగ్ వసూళ్లపై పెట్టిన నిబందనలను పక్కన బెట్టి రెచ్చిపోతున్న పార్కింగ్ దందా పై హెచ్ఎంటీవీ నిర్వహించని గ్రౌండ్ రిపోర్ట్ లో దోపిడి నిజాలు బయట పడ్డాయి.

బాగ్యనగరంలో బైక్, కారు పార్కింగ్ చేయాలంటేనే హడలిపోతున్నారు వాహనదారులు. ఉదయం ఇంటి నుండి బయలు దేరిన తరువాత షాపింగ్ కోసం 5నిమిషాలు ఎక్కడైనా ఆపిన అక్కడ వెటంనే పార్కింగ్ చెల్లించాల్సిందే. అది 5 రూపాయాలో పది రూపాయాలో కాదు ఎకంగా 50 రూపాయాలు వాసులు చేస్తున్నారు కొందరు కాంట్రాక్టర్లు. పార్కింగ్ ఎందుకులే అనుకుని కాస్త రోడ్డుపై పార్క్ చేసామో ఇక ట్రాఫీక్ పోలీసులు చలాన్ల వర్షం కురిసిస్తున్నారని ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు.

రోడ్లపైనే కాదు షాపింగ్ కాంప్లేక్స్ ల్లో సైతం ఇష్టానుసారంగా పార్కింగ్ హవా నడుస్తోంది. రెగ్యూలర్ గా వచ్చే వహానాలకు నెలకోసారి అంటు ప్రత్యేకంగా చార్జీలు వసూళ్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ కు సంబందించిన వివరాలు ఏవి లేకుండానే పార్కింగ్ టికెట్స్ ఇస్తున్నారు. అదే విషయం అక్కడి నిర్వహకుడికి అడిగితే తనకు ఏం సంబంధం లేదని ఓనర్ చెప్పినట్లు చేస్తున్నానని తెలిపాడు.

నగరంలో రద్దీ ప్రాంతాలను ఎంచుకుని కొందరు పార్కింగ్ మాఫీయాను ఎదేచ్చగా కొనసాగిస్తున్నారు. ఒక గంటకు కారుకు 10, ద్విచక్ర వాహనానికి 5 చోప్పున వసూలు చేస్తున్నారు. సమయం దాటితే అదనపు మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఎవరైన ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే గొడవకు దిగుతున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబసభ్యులతో వచ్చేవాళ్లయితే, ఎందుకులే గొడవ అనుకొని అడిగినంత ఇచ్చి పోతున్నారు. ఇక ఎవరైన ఎదురు తిరిగితే దాడులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ప్రధానంగా సెంట్రల్‌జోన్ పరిధిలోని బషీర్‌బాగ్, లిబర్టీ, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, నార్త్‌జోన్ పరిధిలో సికింద్రాబాద్ ప్రాంతాల్లో యథేచ్చగా పార్కింగ్ దోపిడి కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ కేటాయించని ప్రాంతాల్లో కూడా వాహనాల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. 2018లో వాణిజ్య సముదాయాలు, వ్యాపార సంస్థలు, మాల్స్‌, థియేటర్లు, కేఫ్‌ల్లో పార్కింగ్‌ సౌకర్యం ఉచితంగా కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారిచేసిన వాటిని ఎవరు లెక్క చేయడం లేదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక నిమ్స్ ఆసుపత్రిలో ప్రతి రోజు వందల సంఖ‌్యలో టూ విలర్స్, కార్ల పార్కింగ్ చేస్తుంటారు. నిమ్స్‌ ఆసుపత్రిలో ద్విచక్రవాహనానికి 5, కారుకు 10 వసూలు చేయాలని టెండర్‌లో ఉంది. కానీ వారు 20 రూపాయాలు టూ విలర్ కి, 50 రూపాయాలను కారు పార్కింగ్ కోసం వసూలు చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే... అసలు వాళ్ల దగ్గర 10 రూపాయల టోకెనే లేదు.

నిమ్స్ అక్రమ పార్కింగ్ వసూళ్లపై హెచ్ఎంటీవి ప్రశ్నించగా వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. పార్కింగ్ టోకెన్ ఎక్కడ అని ప్రశ్నిస్తే వారి వద్ద సమాదనం లేదు. బోర్డులు ఎర్పాటు చేసామని అవి ఇప్పుడు తోలగిపోయాయి అని నిర్లక్ష్యపు సమాదానాలు ఇస్తున్నారు.

ఇక ప్రసాద్స్ ఐ మాక్స్ పక్కన మరో పార్కింగ్ దందా కొనసాగుతుంది. వారంతా హెచ్ఎండీఏ అనుమతితో పార్కింగ్ వసూళ్లకు తెర లేపారు. ఐ మాక్స్ లో ఫ్రీ పార్కింగ్ ఉన్నా... వీరు వాహనదారుల చూపు మరల్చి పార్కింగ్ మాఫీయాను కొనసాగిస్తున్నారు. ఐ మాక్స్ కు వచ్చే వారంతా అక్కడే గేటుకు అనుకొని ఈ పెయిడ్ పార్కింగ్ ఉండటంతో వందలాది వాహనాలు ఇక్కడ పార్క్ చేస్తున్నారు. ఇదేంటని పార్కింగ్ నిర్వహకులను హెచ్ఎంటీవీ ప్రశ్నించగా తాము పేయిడ్ పార్కింగ్ బోర్డు పెట్టామని అది చూసి కూడా జనాలు వస్తే మాకేం సంబంధం అంటు సమాదానం ఇచ్చారు.

ప్రతి ఎడాది జనవరి నుంచి డిసెంబరు వరకు వాణిజ్య సముదాయాలకు పోలీసులు లైసెన్స్‌ జారీ చేస్తారు. వీటి రెన్యువల్‌ ప్రక్రియ నిరంతరాయం. ఆ సమయంలో శాంతిభద్రతల కోణం నుంచే కాకుండా వీటివల్ల ట్రాఫిక్‌ సమస్యలేమైనా తలెత్తే వీలుందా అనే కోణంలో కూడా చూడాలి. జీవో ప్రకారం సరైన పార్కింగ్‌ స్థలం లేకుంటే లైసెన్సు రెన్యువల్‌ నిలిపివేయాలి. అయితే నగరంలో వాణిజ్య సముదాయాలు, కేఫ్‌ల్లో దాదాపు 70శాతం సరైన పార్కింగ్‌ స్థలాలు లేవు. వీటి లైసెన్సు రెన్యువల్‌ సమయంలో పోలీసులు పట్టించుకోకపోవడంవల్ల తాము నిలువు దోపిడికి గురవుతున్నమని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పార్కింగ్ దోపిడిపై అధికారులు దృష్టి ఏ మాత్రం సారిస్తారో చూడాలి.

పుర్తికథనం కోసం hmtv లో సాయంత్రం 6 గంటలకు చుడండి.


Tags:    

Similar News