మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్‌లో అదృశ్యమైన బాలుడు మృతి చెందాడు. శామీర్‌పేట్ అవుటర్ రింగ్‌రోడ్ పక్కన బాలుడి మృతదేహం లభించింది. బీహార్‌కు చెందిన సుధాంశు శర్మ అభియాన్‌తో షేర్ చాట్ చేస్తుండగా బాలుడి తలకి గాయమైంది. దీంతో అభియాన్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే ఏమంటారోనని భయపడ్డ నిందితుడు శర్మ బాలుని మృతదేహాన్ని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద చెట్ల పొదల్లో పడవేసాడు.
అధియాన్ ఈ నెల 15న ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. ఎక్కడికెళ్లాడా..? అని తల్లిదండ్రులు చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో వెతికారు. అధియాన్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరికి బాలుడు కనిపించట్లేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే ఘోరం జరిగిపోయింది.! చివరికి అదే ఇంట్లో కిరాయికి ఉంటున్న యువకుడే నిందితుడని తేలింది. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.