Hyderabad Metro: ఇక మెట్రో రైల్ ఛార్జీలు పెరగనున్నాయా.?

Hyderabad Metro: త్వరలో ఛార్జీలు పెరుగుతాయనే సంకేతాలు

Update: 2022-11-02 04:25 GMT

Hyderabad Metro: ఇక మెట్రో రైల్ ఛార్జీలు పెరగనున్నాయా.?

Hyderabad Metro Rail Ticket Price: మెట్రో ప్రయాణికులపై మరో భారం పడబోతోంది. పెరిగిన విద్యుత్ ఛార్జీలతో త్వరలో ఛార్జీలు పెరుగుతాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఛార్జీల పెంపు అంశంపై ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఏర్పాటు చేశారు. మెట్రో రైలు చట్టం ప్రకారం మెట్రో రైలు అడ్మినిస్ట్రేషన్‌ కు తొలిసారి ఛార్జీలు మాత్రమే నిర్ణయించే అధికారం ఉంటుంది. సాధారణంగా అన్ని రాష్ట్రాల్లో మెట్రోని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తుంటాయి. వారే మెట్రో రైలు అడ్మినిస్ట్రేషన్ గా ఉంటారు. హైదరాబాద్‌లోని మెట్రో ప్రాజెక్టును పబ్లిక్ - ప్రైవేట్ పార్టనర్ షిప్ విధానంలో చేపట్టారు. ఇక్కడ మెట్రో వ్యవస్థను నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థే నడుపుతోంది.

హైదరాబాద్‌ మెట్రోకు, ఎల్‌ అండ్‌ టీ సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి రైలు సర్వీసుల ప్రారంభంలో మాత్రమే మెట్రో ఛార్జీలను పెంచే అధికారం ఉంది. అందుకే చట్ట ప్రకారం కేంద్రం నియమించే ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీకే ఛార్జీల పెంపు సాధ్యం అవుతుంది. ఇప్పటికే అన్ని రకాల ధరలు పెరిగిన తమకు మెట్రో రైలు ఛార్జీలు కూడా పెరిగితే కష్టం అంటున్నారు ప్రయాణికులు. ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీని నియమించాలని హైదరాబాద్ మెట్రో సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతో గత నెలలో కమిటీ ఏర్పాటు జరిగింది. అయితే ఛార్జీలు ఎంత పెంచాలనేది సొంతంగా కమిటీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో సంస్థ తమ ప్రతిపాదనలను కమిటీకి అందజేయనుంది.

అయితే పెరిగిన ఆక్యుపెన్సీ ఒకవైపు విద్యుత్‌ చార్జీల భారం మరోవైపు గుదిబండగా మారిన నేపథ్యంలో సంస్థ పీకల్లోతు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం రోజుకు సరాసరిన 50 లక్షల నష్టంతో నెట్టుకొస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కోవిడ్‌ కలకలం నుంచి తేరుకున్నప్పటికీ ఆక్యుపెన్సీ ఆశించిన స్థాయిలో పెరగలేదని నిర్మాణ సంస్థ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చార్జీలు కొంతమేర మాత్రమే పెంచాలని ప్రయాణికులంటున్నారు.ప్రస్తుత ఛార్జీల పెంపునకు సంబంధించి పౌరులు, మెట్రో ప్రయాణికులు తమ అభిప్రాయాలు, సలహాలను నవంబరు 15లోగా తెలపవచ్చని కమిటీ చెప్పడంతో చివరకు ఏమి తేలుస్తారో అర్దం కాని పరిస్థితి కనిపిస్తోంది.

Tags:    

Similar News