హైదరాబాద్ లో మెట్రోరైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ ఆపర్ అంటూ తాత్కాలికంగా చార్జీలను తగ్గించింది. నగరంలో ఉండే మెట్రోలో బతుకమ్మ పండుగ నుంచి సంక్రాంతి పండుగ వరకు ఇచ్చిన ప్రత్యేక ఆఫర్ లపై ఓ స్టోరి.
భాగ్యనగర ప్రయాణికులకు మెట్రో రైలు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దసరా, బతుకమ్మ పండుగలను పురస్కరించుకుని ఆ సంస్థ రాయితీలు ప్రకటించింది. మెట్రో సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో 40 శాతం రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 17 నుంచి ఈ నెలాఖరు వరకు మెట్రో ప్రయాణికులకు ఆఫర్ వర్తించనుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.
మెట్రో ప్రయాణికుల కోసం టీ సవారీ మొబైల్ యాప్ ద్వారా నవంబర్ 1 నుంచి మరో ఆఫర్ అమలు అవుతుంది. 7 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే, 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం. 14 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే 45 రోజుల్లో 30 ట్రిప్పులు. 20 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం కల్పించారు. అలాగే 30 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే 45 రోజుల్లో 45 ట్రిప్పులు. 40 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం కల్పించారు.
మెట్రో సంస్థ తన ఉదారతను చాటుకుంది. భారీ వర్షం పడ్డ రోజు గర్భిణి కోసం విక్టోరియల్ స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రత్యేకంగా మెట్రో రైలు నడిపి ఆ మహిళను ఇంటికి పంపించినట్లు తెలిపారు.