Hyderabad: వేగం పెంచిన హైదరాబాద్ మెట్రో రైల్

Hyderabad: *రెండు రోజులపాటు టెస్ట్ డ్రైవ్ *సాంకేతిక అనుమతులు రావడంతో పెరిగిన వేగం

Update: 2022-04-04 04:20 GMT

Hyderabad: వేగం పెంచినన హైదరాబాద్ మెట్రో రైల్

Hyderabad:రద్దీగా ఉండే హైదరాబాద్ లో ఆఫీస్ కు వెళ్లాలంటే ట్రాఫిక్ జామ్ లతో నరకం కనిపిస్తుంది. మెట్రో రైల్ వచ్చిన తర్వాత ఈరకమైన ఇబ్బందులు కొంత తగ్గాయి. ముఖ్యంగా సాఫ్ట్ ఎంప్లాయీస్ కు కనెక్టివిటీ సౌకర్యంగా ఉండటంతో చాలా మంది మెట్రోలోనే ప్రయాణిస్తున్నారు. అయితే దేశంలోని ఇతర మెట్రో రైళ్లతో పోల్చితే హైదరాబాద్ మెట్రో రైల్ స్పీడ్ కాస్త తక్కవగానే ఉంటుంది. స్పీడ్ పెంచితే ఆక్యుపెన్సీ రేట్ పెరుగుతుందని భావించిన హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు సిగ్నలింగ్ సాప్ట్‌వేర్‌కు మార్పులు చేశారు. ఇకపై మన మెట్రో రైల్ కూడా గరిష్ట వేగంతో నడవనుంది. ఈసాప్ట్‌వేర్ ఆధునీకరణ పనులను సీఎంఆర్‌ఎస్ అదికారులు పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. భద్రతా పరీక్షల్లో భాగంగా స్పీడ్ ట్రయల్స్‌ను కూడా నిర్వహించారు. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఆధునీకరించిన సిస్టమ్స్ సాప్ట్‌వేర్‌ను ఉపయోగించేందుకు కమిషనర్ ఫర్ మెట్రో రైల్ సేప్టీ అధికారులు అనుమతించారు.

స్పీడ్ పెంచడం ద్వారా మెట్రో రైళ్లు పూర్తి వేగంతో నడుస్తున్నాయి. ఇంతకు ముందు గంటకు 70 కిలోమీటర్ల ‎వేగంతో ప్రయాణించిన రైళ్లు ఇప్పుడు 80 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తున్నాయి.. దీంతో కారిడార్-1 లో మియాపూర్ నుంచి ఎల్బీనగర్ కు 4 నిమిషాలు, కారిడార్*-2లో MGBS నుంచి JBS వరకు నిమిషం15 సెకన్లు, కారిడార్-3 లో నాగోల్ నుంచి రాయదుర్గ్ మధ్య 6 నిమిషాల ప్రయాణ సమయం తగ్గింది. వేగం పెరగడంతో టర్మినల్ స్టేషన్‌ల మధ్య సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది. ఇది తమకెంతో ఉపయోగంగా ఉందంటున్న ప్రయాణీకులు రైళ్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్ మెట్రో రైల్ వేగం పెరగడంతో రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణీకుల డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని రైళ్ల సంఖ్యను మరింత పెంచితే హైదరాబాద్ మెట్రోకు ఆదరణ కూడా పెరుగుతుంది. ప్రస్తుతం నష్టాలలో నడుస్తున్న హైదరాబాద్ మెట్రో లాభాల గాడిలో పడి.. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించాలని కోరుకుందాం.

Full View


Tags:    

Similar News