హైద్రాబాద్ కోకాపేట రియల్ ఎస్టేట్... ఇండియాలో టాప్-2

కోవిడ్ తర్వాత దేశంలోని ఏడు నగరాల్లో రెసిడెన్షియల్ భూముల ధరలు పెరిగాయి.

Update: 2024-08-27 14:58 GMT

హైద్రాబాద్ కోకాపేట రియల్ ఎస్టేట్... ఇండియాలో టాప్-2

హైద్రాబాద్ కోకాపేటలో ఐదేళ్లలో రెసిడెన్షియల్ భూముల ధరలు 89 శాతం పెరిగాయి. అనరాక్ రీసెర్చ్ సంస్థ సోమవారం విడుదల చేసిన తాజా రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. హైద్రాబాద్‌లోని కోకాపేట రియల్ ఎస్టేట్ మార్కెట్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఫస్ట్ ప్లేస్ లో ఇప్పటికీ బెంగళూరు కొనసాగుతోంది.

అయిదేళ్ళలో ఆకాశం అంటిన ధరలు...

హైదరాబాద్‌లో 2019 నుంచి 2024 వరకు రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎలా ఉందన్నది ఈ నివేదిక విశ్లేషించింది. ఈ మధ్యకాలంలో కోకాపేట ఇళ్ళ స్థలాల ధరలు గణనీయంగా పెరిగాయి. ఇక్కడ 2019లో చదరపు అడుగు ధర రూ. 4,750 రూపాయలు. ఇప్పుడది రూ. 9 వేలకు పెరిగింది. ఈ అయిదేళ్ళలో కోకాపేటలో కొత్తగా 12,920 రెసిడెన్షియల్ యూనిట్లు నిర్మించారు. ఈ ప్రాంతంలో అల్ట్రా లగ్జరీ నివాసాల ధర రెండున్నర కోట్లు దాటింది.

బాచుపల్లిలో రెసిడెన్షియల్ ధరలు 57 శాతం పెరిగాయి. ఇక్కడ చదరపు అడుగు ధర రూ.3,690 నుంచి రూ.5,800లకు పెరిగింది. తెల్లాపూర్ లో కూడా ధరలు 53 శాతం పెరిగాయి. 2019లో చదరపు అడుగుకు రూ.4,819గా ఉన్న ధర ప్రస్తుతం రూ.7,350కి పెరిగింది. ఇక్కడ 18,960 కొత్త ఇళ‌్ల నిర్మాణం చేపట్టారు.

దేశంలో ఏడు నగరాల్లో పెరిగిన రెసిడెన్షియల్ భూముల ధరలు

కోవిడ్ తర్వాత దేశంలోని ఏడు నగరాల్లో రెసిడెన్షియల్ భూముల ధరలు పెరిగాయి. బెంగుళూరు, హైద్రాబాద్, దిల్లీ ఎన్ సీ ఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లలో సగటున 45 శాతం ధరలు పెరిగాయి. ఈ ఏడు నగరాల్లో కొన్ని చోట్ల 90 శాతం వరకు ధరలు పెరిగాయి.

బెంగుళూరులో 90 శాతం ధరలు పెరిగి దేశంలోనే టాప్ ప్లేస్ లో ఉంది. బెంగుళూరు వైట్ ఫీల్డ్ లో 80 శాతం, డిల్లీ ఎన్ సీ ఆర్ ద్వారకాలో 79 శాతం, బెంగుళూరు సర్జాపూర్ రోడ్ లో 58 శాతం, హైద్రాబాద్ బాచుపల్లిలో 57 శాతం, తెల్లాపూర్ లో 53 శాతం, ఎంఎంఆర్ పన్వెల్ లో 50 శాతం, ఎన్ సీ ఆర్ న్యూ గురుగ్రామ్ లో 48 శాతం, ఎంఎంఆర్ దోంబివిల్లిలో 40 శాతం ధరలు పెరిగాయి.

ALSO READ: అమరావతిలో రియల్ ఎస్టేట్ ధరలు పెరిగితే హైద‌రాబాద్‌లో తగ్గుతాయా?

Full View


Tags:    

Similar News