Low Cost Houses in Hyderabad: ఇల్లు కొనే ప్లాన్ లో ఉన్నారా..హైదరాబాద్ భారీగా తగ్గిన ఇళ్ల ధరలు..ఈ ఏరియాలో తక్కువ ధరకే ఇల్లు
Low Cost Houses in Hyderabad: మీరు ఇల్లు కొనే ప్లాన్ లో ఉన్నారా? హైదరాబాద్ లో ఇల్లు కొనాలని చూస్తున్నారా. హైదరాబాద్ లో ఇళ్లకు భారీగా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. సాధారణ ప్రజలు కొనలేని పరిస్థితి ఉంది. రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయి తప్పా తగ్గడం లేదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఏరియాలో మాత్రం ఎవరైనా ఇంటిని కొనుగోలు చేసే విధంగా బడ్జెట్ ధరలోనే ఇల్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడో చూద్దాం.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు అందుబాటు ధరలో ఇల్లు కొనుగోలు చేయడం గురించి ఆలోచించినట్లయితే..శామీర్ పేట ప్రాంతం బెస్ట్ ఛాయిస్ గా మారుతోంది. 40-50 బడ్జెట్లో ఉన్నవారికి శామీర్ పేటలో అపార్ట్ మెంట్లు, ఇండిపెండెంట్ ఇల్లులు, విల్లాలు వంటి ఆప్షన్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నగర జీవితం ఆర్థిక భారంగా మారుతున్న తరుణంలో తక్కువ ఖర్చుతో అందమైన వసతులు అందించే కేంద్రంగా శామీర్ పేట వెలుగొందుతోంది.
ఇల్లు లేదా ఫ్లాట్ కొనడానికి ముందు రవాణా సౌకర్యాలు, నీటి వసతులు, సమీప విద్యాసంస్థలు, వైద్య సేవలు వంటి మౌలిక సదుపాయాలపై ప్రతి ఒక్కరూ ఫోకప్ పెడతారు. ఈ అవసరాలన్నీ శామీర్ పేటలో అందుబాటులో ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉండటం కూడా శామీర్ పేటకు ప్రయోజనంగా ఉంది. రాజీవ్ రహదారి, కొత్తగా నిర్మితమైన మేడ్చల్ కలెక్టరేట్, మున్సిపాలిటీ స్థాయిలో డెవలప్ చెందిన ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంపై ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
అయితే ఇక్కడ 945 చదరపు అడుగుల విస్తీర్ణంలో డబుల్ బెడ్రూం ప్లాట్లు 45 లక్షల్లో లభిస్తున్నాయి. 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లాట్లు 52 లక్షల ధరలో అందుబాటులో ఉన్నాయి. అతి త్వరలోనే ఎంఎంటీస్ ట్రైన్ సర్వీసులు కూడా ఈ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో ఇక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మరింత ఊతం ఇస్తుంది.