Demolition of Illegal Buildings: ఆరు అంతస్తుల అక్రమ భవన నిర్మాణాన్ని కుల్చివేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు

Demolition of Illegal Buildings: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) అధికారులు మెహదీపట్నంలో అక్రమంగా నిర్మించిన ఆరు అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు.

Update: 2020-08-27 12:14 GMT

Demolition of Illegal Constructions

Demolition of Illegal Buildings: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) అధికారులు మెహదీపట్నంలో అక్రమంగా నిర్మించిన ఆరు అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. 2019 నుంచి భవన యజమానికి నాలుగు నోటీసులు పంపినప్పటికీ భవనం నిర్మాణ పనులు ఆగలేదని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఇండియన్ పీనల్ కోర్ట్ సెక్షన్ 461, 451/1, 452/2 కింద నోటీసులు పంపారు. కూల్చివేత తరువాత, భవనం యజమాని అధికారులతో వాగ్వాదానికి దిగాడు.

గత నెలలో శేరిలింగంపల్లి జోన్‌లో అక్రమ నిర్మాణం గల 30 భవనాలకు సంబంధించి 140 స్లాబ్‌లను అధికారులు కూల్చివేసారు.. జూన్‌లో అధికారులు మాధాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో 29 అనధికార భవన నిర్మాణాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ, మునిసిపల్ కార్పొరేషన్ నుండి అనుమతి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేని అనధికార ఆస్తులను కొనుగోలు చేయవద్దని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అక్రమ నిర్మాణాలతో పాటు,  నగరంలోని పాత, శిధిలమైన భవనాలను కూడా అధికారులు కూల్చివేశారు. ఆగస్టు 18 న అధికారులు మలక్‌పేటలోని శిధిలమైన ఇంటిని, అంబర్‌పేట్‌లోని పాత భవనాన్ని, రామంతపూర్‌లోని శిధిలమైన గోడను కుల్చివేసిన విషయం తెలిసిందే.  

Tags:    

Similar News