Hyderabad: కరోనా ఎఫెక్ట్‌.. బేగం బజార్ మార్కెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం!

Hyderabad: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి.

Update: 2021-04-08 10:50 GMT

Hyderabad: కరోనా ఎఫెక్ట్‌.. బేగం బజార్ మార్కెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం!

Hyderabad: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఈ కేసులు మరింత వేగంగా పెరుగుతున్నాయి. మరోవైపు నిత్యం రద్దీగా ఉండే బేగంబజార్‌పై కరోనా పంజా విసురుతోంది. మార్కెట్లోని దాదాపు వంద మంది వ్యాపారులకు కరోనా సోకింది.

దీంతో మార్కెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే మార్కెట్ తెరవాలని నిర్ణయించింది. సాయంత్రం 5 తర్వాత అన్ని షాపులను బంద్ చేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా తగ్గేవరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. ఈ నిబంధనలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని మార్కెట్ అసోసి‍యేషన్ ప్రకటించింది. 

Tags:    

Similar News