Telangana: రోజురోజుకు వేడెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు

Telangana: ఒకవైపు హుజురాబాద్‌తో తెలంగాణ రాజకీయం హిట్ ఎక్కుతుంటే.... మరోవైపు కాంగ్రెస్‌ నేతలు సీఎంను కలవడం

Update: 2021-06-26 03:36 GMT

తెరాస & బీజేపీ (ఫోటో ది హన్స్ ఇండియా)

Telangana: తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఒకవైపు హుజురాబాద్‌తో తెలంగాణ రాజకీయం హిట్ ఎక్కుతుంటే.... మరోవైపు కాంగ్రెస్‌ నేతలు సీఎంను కలవడం ఆసక్తి రేపుతోంది. ఇంతకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎంను కలవడం వెనుక రహస్యం ఏంటి..? కాంగ్రెస్‌ నేతలకు ఆపాయింట్‌మెంట్‌ ఇవ్వడం వెనక కేసీఆర్‌ స్ట్రాటజీ ఎంటీ? ప్రగతిభవన్‌లో అసలేం జరిగింది.

ఈటల రాజేందర్‌ కాషాయ తీర్థం పుచ్చుకున్న తర్వాత రాష్ట్ర రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. సీఎం మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆపాయింట్‌ మెంట్ ఇవ్వడని ఈటల చేసిన కామెంట్స్‌ని కొట్టిపడేసేలా కేసీఆర్‌ కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. ఈ మధ్య కేబినెట్‌ సమావేశంలో మంత్రులు తనని ఎప్పుడైనా కలవొచ్చని చెప్పడం... ఆ వెంటనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్‌ ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఈటలకు చెక్‌ పెట్టడానికే ఎప్పటికప్పుడు రాజకీయ ఎత్తులు మారుస్తూ... కేసీఆర్‌ వేగంగా పావులు కదుపుతున్నారనే అనే చర్చ జరుగుతుంది.

గత ఏడేళ్లలో కేసీఆర్‌ రాజకీయ పార్టీ నేతలకు ప్రత్యేకంగా పాయింట్ మెంట్ ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అటల్ బిహారీ వాజ్పై స్మృతివనం ఏర్పాటు కోసం 2018 ఎన్నికలకు ముందు వినతిపత్రం ఇచ్చేందుకు బీజేపీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత సీపీఎం జాతీయ ప్లీనరీ సందర్భంగా అనుమతుల కోసం రాష్ట్ర పార్టీ నేతలు కలిశారు. ఇలా రెండు సందర్భాల్లో తప్ప ఇతర ఏ సందర్భంలోనూ కేసీఆర్‌ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు, నేతలకు అపాయింట్మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ వెళ్లడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ మారింది.

దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్‌పై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం గవర్నర్‌‌ తమిళిసైని కలిసి పరిస్థితి వివరించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ తర్వాత సీఎంను కలిశారు. అయితే కేసీఆర్‌ అపాయింట్మెంట్‌ ఇవ్వడం వెనుక కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతుంది. 2018 ఎన్నికల సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ను కలిసిన తర్వాత రాజకీయంగా బీజేపీకి ఇబ్బందులు ఎదురయ్యాయని చాలా రోజుల పాటు చర్చ జరిగింది. ఇప్పుడు టీపీసీసీ ప్రకటన, హుజురాబాద్ ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వడం... కేసీఆర్ వ్యూహంలో భాగమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతుంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఓట్లను పోలరైజ్ చేసేందుకు కేసీఆర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతుంది.

గతంలో నెరేళ్ల ఘటన సందర్భంలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నేతలకు అపోయింట్మెంట్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అడుగగానే ఒకే చెప్పడం వెనుక... హుజూరాబాద్‌లో బీజేపీని ఇరుకటంలో పెట్టడానికేనన్న టాక్‌ వినిపిస్తోంది. ప్రతిపక్షాలను ట్రాప్‌ చేయడంలో కేసీఆర్‌ దిట్ట. ఈ టైమ్‌లోనే కాంగ్రెస్‌ నేతలు అపాయింట్మెంట్‌ కోరడంతో... అంది వచ్చిన అవకాశాన్ని కేసీఆర్‌ సక్సెస్‌ ఫుల్‌గా సద్వినియోగం చేసుకున్నారని పొలిటికల్‌ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది. 

Tags:    

Similar News